పొలిచెర్ల హరనాథ్‌కు జీవన సౌఫల్య పురస్కార ప్రదానం
డెట్రాయిట్కు చెందిన ప్రవాస తెలుగు ప్రముఖుడు డా.హరనాథ్ పొలిచెర్లకు చిత్తూరు ప్రవాసుల సంస్థ ఇటీవల సెయింట్ లూయిస్‌లో జరిగిన తానా మహాసభల్లో జీవన సాఫల్య పురస్కారాన్ని అందించింది. చిత్తూరు ప్రవాసుల 5వ సమ్మేళనంలో ఆయనకు ఈ అవార్డును కేరళ హైకోర్టు న్యాయమూర్తి శేషాధ్రి నాయుడు, తానా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు వేమన సతీష్, చిత్తూరు ప్రవాసుల సంఘం అధ్యక్షుడు పంత్ర సునీల్, వ్యవస్థాపక అధ్యక్షుడు వడ్లమూడి వెంకటేష్ బాబు, కోశాధికారి శివ లంకిపల్లె , సభ్యులు కాకరాల విజయమోహన్, కొడిదెల లోకేష్ నాయుడు, దేవీ తదితరులు ఆయనకు ఈ పురస్కారాన్ని అందించారు. ఫౌల్ట్రీ, ఆధ్మాత్మిక, పాలోత్పత్తి, కూరగాయల సాగు వంటి రంగాల్లో చిత్తూరు అగ్రపథాన దూసుకుపోతోందని జిల్లాకు సరిహద్దులుగా ఉన్న బెంగళూరు, మద్రాస్ వంటి నగరాల దృష్ట్యా పెట్టుబడులకు అనువైన ప్రాంతమని ప్రసంగించిన వక్తలు పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో రాయలసీమ నుండి ప్రవాసులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తితిదే ప్రత్యేక అధికారి సుబ్బరాయశర్మ, జస్టిస్ శేషాద్రినాయుడులను సంస్థ ప్రతినిధులు సతీష్‌తో కలిసి సన్మానించారు. తితిదే వేదపండితులు హరనాథ్‌కు ప్రత్యేక ఆశీర్వచనం అందించారు. కార్యక్రమంలో నర్సాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు పాల్గొన్నారు.













