TANA: సినీ ప్రముఖులు నవీన్ ఎర్నేనిని సత్కరించిన తానా
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) డిట్రాయిట్లో నిర్వహించిన 24వ తానా మహాసభల్లో 2వ రోజు పలువురు ప్రముఖులను తానా ఘనంగా సత్కరించింది. మైత్రీ మూవీస్ అధినేత నవీన్ ఎర్నేని (Naveen Yerneni) ని తానా మహాసభల వేదికపైకి ఆహ్వానించి తానా నాయకులు ఆయనను సత్కరించారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించి సంచలనం సృష్టించిన నవీన్ ఎర్నేని నేడు టాలీవుడ్ లోను పాపులర్ పర్సన్ గా ఉన్నారు. శ్రీమంతుడు, రంగస్థలం జనతా గ్యారేజి, పుష్ప, వాల్తేరు వీరయ్య, వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. అలాగే అమెరికాలోని ఎన్నారైలకు తెలుగు సంఘాలకు వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్నారు. తానా మహాసభలకు వచ్చిన ఆయనను తానా నాయకులు అభినందించి సత్కరించారు.
తానా బోర్డ్ చైర్మన్ నాగేంద్ర కొడాలి, ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి, రవి పొట్లూరి, మాజీ అధ్యక్షులు జయరామ్ కోమటి, అంజయ్య చౌదరి లావు, కాన్ఫరెన్స్ నాయకులు గంగాధర్ నాదెళ్ళ, ఉదయ్ కుమార్ చాపలమడుగు, సునీల్ పంట్ర, కిరణ్, జోగేశ్వరరావు పెద్దిబోయిన, తానా ఎగ్జిక్యూటివ్ టీమ్ నాయకులు తదితరులు వేదికపైకి వచ్చి ఆయనను ఘనంగా సత్కరించారు. నవీన్ ఎర్నేని కుటుంబ సభ్యులను కూడా వేదికపైకి ఆహ్వానించారు. సినీనటుడు రాజేంద్రప్రసాద్ ఆయనకు మెమోంటో ఇచ్చి, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా నవీన్ ఎర్నేని మాట్లాడుతూ తానాలాంటి సేవా సంస్థ తనకు సన్మానం చేయడం ఆనందంగా ఉందని అన్నారు.







