కరోనా విపత్కర పరిస్థితుల్లో పేదలకు చేసిన సహాయ కార్యక్రమాలకు తానా ఫౌండేషన్ బహుమానం
ఒంగోలు పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త షేక్ సర్దార్ కరోనా విపత్కర పరిస్థితుల్లో తానా ఫౌండేషన్ సహకారం మరియు కొందరు దాతల సహకారంతో అనాధలకు, పేదలకు, వృద్ధులకు, ఆహారం, నిత్యావసర సరుకులు, వారికి కావాల్సిన మెడిసిన్ అందజేసి పలువురి ప్రశంసలందుకున్నారు. ముఖ్యంగా సర్దార్ చేసిన సేవా కార్యక్రమాలలో పలువురు ఎన్.ఆర్.ఐ. లు తానా ఫౌండేషన్ వారు సహకారం అందించారు. సర్దార్ అందించిన అత్యుత్తమ సేవలు గుర్తించి తానా ఫౌండేషన్ చైర్మన్ శృంగవరపు నిరంజన్ గారు ఒక స్కూటర్ బహూకరించి ప్రత్యేకంగా అభినందించారు.
తన నిస్వార్థ సేవను గుర్తించి స్కూటర్ బహుమతిగా అందించిన తానా ఫౌండేషన్ చైర్మన్ నిరంజన్ గారికి ఈ సందర్భంగా సర్దార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మానవత్వం కలిగిన పలువురు ఎన్.ఆర్.ఐ. లు మరియు ప్రత్యేకంగా తానా ఫౌండేషన్ వారు కరోనా విపత్కర పరిస్థితుల్లో సహాయం అందించి సేవా కార్యక్రమాలకు ప్రోత్సహించటం వల్లనే తాను అనేక మందికి సహాయం చేయగలిగానని భవిష్యత్తులో అందరి సహాయ సహకారాలతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని తెలిపారు.













