విజయవంతముగా ముగిసిన తానా ఫౌండేషన్ మెగా ఐ క్యాంపు
వెస్ట్ గోదావరి జిల్లా నరసాపురం మండలము, గుడ్లపల్లి గ్రామము నందు తానా ఫౌండేషన్ మరియు రోటరీ హాస్పిటల్ సంయుక్తముగా March 19 2022 మెగా ఐ క్యాంపు విజయవంతముగా నిర్వహించడం జరిగినది. సుమారు మూడువందల యాభై మంది పైగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికీ కళ్ళ జోళ్ళు పంచడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన గ్రామ పెద్దలు తానా ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఈ కార్యక్రమానికి నాగ కొండలరావు అబ్బూరి స్పాన్సర్ చెయ్యడం జరిగినది .ఈ కార్యక్రమానికి గుడ్లపల్లి గ్రామ వాస్తవ్యులు నందకుమార్ ఆలూరి, తానా ఫౌండేషన్ ట్రస్టీ పురుషోత్తమ చౌదరి గుడే సమన్వయకర్తలుగా వ్యవహరించారు.













