విజయవంతముగా ముగిసిన తానా ఫౌండేషన్ ఐ క్యాంపు
కృష్ణా జిల్లా గొడవర్రు గ్రామం నందు తానా ఫౌండేషన్ , రోటరీ హాస్పిటల్ విజయవాడ సంయక్తముగా మే ఇరువది ఎనిమిది (May 28 2022) తేదీ మెగా ఐ క్యాంపు నిర్వహించడం జరిగినది. సుమారు మూడువందల పైగా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికీ కళ్ళ జోళ్ళు పంచడం జరిగినది. కార్యక్రమానికి హాజరైన గ్రామ పెద్దలు తానా చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఈ మెగా ఐ క్యాంపు కార్యక్రమానికి హరికృష్ణ గుళ్ళపల్లి గారు స్పాన్సర్ చెయ్యడం జరిగినది . తానా ఫౌండేషన్ ట్రస్టీ పురుషోత్తమ చౌదరి గుడే ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తగా వ్యవహరించారు.













