ఆదరణ ఓల్డ్ ఏజ్ హోమ్ వాసులకు చీరలు, పంచెల పంపిణీ
విజయవాడలోని ఆదరణ ఓల్డ్ ఏజ్ హోంలో ఉంటున్న వృద్ధులకు, మహిళలకు పంచెలు, చీరలను తానా ఫౌండేషన్ చైర్మన్ నిరంజన్ శృంగవరపు పంపిణీ చేశారు. వారి మాతృమూర్తి శృంగవరపు ఇంద్రావతి ప్రథమ వర్థంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. విజయవాడలో పలువురికి అన్నదానం కూడా చేశారు. తన తల్లిగారు ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి ముందుండేవారని వారి ప్రథమ వర్థంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిరంజన్ శృంగవరపు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఎంతోమందికి తనవంతుగా సహాయపడాలని అనుకుంటున్నానని, తానా ఫౌండేషన్ చైర్మన్గా కూడా ఎన్నో సహాయ కార్యక్రమాలు నిర్వహించినట్లు నిరంజన్ శృంగవరపు తెలిపారు. కరోనా సమయంలో తానా ఫౌండేషన్ తరపున తెలుగు రాష్ట్రాల్లో పలువురికి అన్నదానం, నిత్యావసర వస్తువుల పంపిణీ వంటి కార్యక్రమాలను నిర్వహించినట్లు చెప్పారు.













