తానా మరో కొత్త కార్యక్రమం… తానా ఫ్లాగ్ ఫుట్‌బాల్ లీగ్
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో యువతను ఆకట్టుకునే స్పోర్ట్స్ కార్యక్రమాలను ప్రవేశపెట్టడంలో తానా క్రీడా కార్యదర్శి శశాంక్ యార్లగడ్డ విజయం సాధిం చారు. ఇప్పుడు తాజాగా తానా ఫ్లాగ్ ఫుట్‌బాల్ పోటీలను ప్రవేశపెట్టారు. గతంలో నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ ఎక్కువగా ఆడే బాస్కెట్ బాల్ ఆటని తీసుకొని అందునా త్రీ ఆన్ త్రీ అంటూ క్రొత్త ఫార్మాట్‌తో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అలాగే చెస్, వికలాంగుల క్రికెట్, జాతీయ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ వంటి వివిధ క్రీడల నిర్వహణలో ఓవపు బిజీగా ఉంటూనే మరోవైపు కొత్త టోర్నమెంట్ల నిర్వహణకు కృషి చేస్తు న్నారు. తాజాగా తానా చరిత్రలో మొదటి సారిగా మరో సరికొత్త క్రీడా కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. అదే తానా ఫ్లాగ్ ఫుట్ బాల్ లీగ్. నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ అమితంగా ఇష్టపడే ఫుట్‌బాల్ క్రీడను నార్త్ కరోలినా లోని ట్రయాంగిల్ ఏరియా తెలుగు సంఘం అధ్యక్షులు రాజేష్ యార్లగడ్డ, వారి జట్టు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు.
జులై 30న నార్త్ కరోలినా రాష్ట్రంలోని ఎపెక్స్ నగరంలో నిర్వహించిన ఈ ఫ్లాగ్ ఫుట్‌బాల్ లీగ్‌లో సుమారు 60 మంది బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు సాగిన ఈ ఫుట్ బాల్ లీగ్‌లో పాల్గొన్న వారందరూ 8 నుంచి 12 వ తరగతి లోపు విద్యార్థులవడం విశేషం. కరెక్టుగా పిల్లలు తిరిగి స్కూల్స్‌కి వెళ్లే ముందు సందర్భాను చితంగా వారికోసం ప్రత్యేకంగా ఈ ఫుట్ బాల్ లీగ్ నిర్వహించడంతో అందరూ శశాంక్ మరియు ట్రయాంగిల్ ఏరియా తెలుగు సంఘం లీడర్షిప్ సభ్యులను అభినందించారు.
ట్రయాంగిల్ ఏరియా తెలుగు సంఘం నుంచి వంశీ కట్టా, రాజేష్ యార్లగడ్డ, కిరణ్ కాకర్లమూడి, రాజ్, సిద్ధ కోనంకి, శ్రీధర్ గోరంటి, తానా నుంచి వినోద్, శశాంక్ యార్లగడ్డ, సురేష్ కాకర్ల, శరత్ కొమ్మినేని, కుమార్ చల్లగొళ్ళ, అఖినా మూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.













