తానా మహాసభలో ఎమ్మెల్యే బండారుకు ఘన సత్కారం
ప్రపంచంలో అతి పెద్ద ప్రవాస తెలుగు సంఘమైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) స్థాపించి మే 28 నాటికి 40 వసంతాలు ముగిసాయి. మూడు రోజుల పాటు నిర్వహించిన 21వ తానా ద్వైవార్షిక మహాసభ లో ముగింపు రోజు జరిగిన తానా సభలో ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు వారు ఎక్కడ ఉన్న జన్మభూమిని మరిచిపోకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపటడం అభినందనీయమన్నారు. తెలుగు భాషకు చలన చిత్రాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మహానీయుడు పద్మశ్రీ బాపు గారి విగ్రహాన్ని ఆంధ్రరాష్ట్రంలో మొటమొదటిగా నరసాపురంలోని గోదావరి తీరాన ఏర్పాటు చేయడంలో తానా సభ్యుల సహకారం మరువలేనిదన్నారు. భవిష్యత్లో తెలుగు వారి ఖ్యాతి మరింత ఇనుమడింప చేసేలా తానా సభ్యులు చొరవ తీసుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం చిత్తూరు ఎన్ఆర్ఐలు ఎమ్మెల్యేలు బండారు మాధవనాయుడును సన్మానించి, జ్ఞాపికలు అందజేసారు. నరసాపురం నియోజకవర్గాభివృద్ధికి బండారు చేస్తున్న సేవలు అమూల్యమైనవని తానా సభ్యులు ప్రసంగించారు.













