జూన్ 21న తానా పితృదినోత్సవ వేడుకలు
“తానా ప్రపంచ సాహిత్యవేదిక” ఆధ్వర్యం లో అంతర్జాతీయ పితృదినోత్సవ సందర్భం గా ఆదివారం, జూన్ 21 న (భారత కాలమాన ప్రకారం 9:30 pm, అమెరికా డల్లాస్ సమయం 11:00 am) ‘నాన్నా నీకు నమస్కారం’ అంటూ పితృదినోత్సవ వేడుకలను దృశ్య సమావేశం లో ఘనంగా జరుపనున్నామని, ఈ వేడుకలకు పద్మశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ప్రముఖ రచయిత, నటులు శ్రీ తనికెళ్ళ భరణి విశిష్ట అతిధులు గా హాజరవుతున్నారని తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి, తానా ప్రపంచ సాహిత్య వేదిక సారధి డా. ప్రసాద్ తోటకూర ఒక సంయుక్త ప్రకటనలో తెలియజేశారు.
ఈ సందర్భంగా ‘ఘనుడు నాన్న, త్యాగధనుడు నాన్న’ అనే అంశం మీద తానా నిర్వహించిన ప్రపంచవ్యాప్త కవితా పోటీలలోని విజేతలకు బహుమతి ప్రదానం జరుగుతుంది. ఈ పోటీలకు విశేష ఉభయ తెలుగు రాష్ట్రాల నుండే గాక అనేక దేశాలనుండి వందలాది రచయితలు పాల్గొన్నారని సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్ ప్రకటించారు.
వెన్నం ఫౌండేషన్ ఈ కార్యక్రమానికి ఫోషక దాత గా, బైట్ గ్రాఫ్స్ సాంకేతిక సహకారం అందిస్తోంది.
ఈ కార్యక్రమాన్ని తానా ఫేస్ బుక్ ద్వారా గాని, తానా యు ట్యూబ్ ఛానెల్ ద్వారా గాని, లేదా ‘మన టీవీ’ లో ను ప్రత్యక్ష ప్రసారం లోను చూడవచ్చని, మిగిలిన వివరాలకు www.tana.org న సందర్శించవలసిందిగా తానా అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి ప్రకటించారు.













