TANA: తానా మాజీ అధ్యక్షుడు నాదెళ్ల గంగాధర్ సతీమణి మృతిపట్ల పలువురి సంతాపం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(TANA) మాజీ అధ్యక్షుడు నాదెళ్ల గంగాధర్ సతీమణి మృతిపట్ల పలువురు తానా నాయకులు, ఎన్నారైలు ఇతర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గంగాధర్ సతీమణి దుర్గ మరణించారు. అనారోగ్య కారణాలతో ఆమె గత కొంతకాలంగా హైదరాబాద్‌లోనే చికిత్స తీసుకుంటున్నారు.
గంగాధర్‌కు ఇద్దరు కుమార్తెలు. దుర్గ మృతి పట్ల తానా కార్యవర్గ సభ్యులు, ప్రతినిధులు, అమెరికావ్యాప్తంగా పలు తెలుగు సంఘాల ప్రతినిధులు ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 2025 జులైలో నిర్వహిస్తున్న 24వ తానా మహాసభలకు గంగాధర్ ఛైర్మన్‌గా ఉన్నారు.








