తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ల్యాప్ టాప్ ల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం దుద్దుకూరు కు చెందిన ప్రవాసాంధ్రుడు రాయన సుబ్బారాయుడు తన గ్రామానికి చెందిన ఏడుగురు పేద విద్యార్థులకు ల్యాప్టాప్లు అందజేశారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడు లక్షల రూపాయలతో 7 ల్యాప్టాప్లను విరాళంగా అందజేశారు. అమెరికాలోని వర్జీనియాలో నివాసం ఉంటున్న సుబ్బారాయుడు తన గ్రామ అభివృద్ధి కోసం చేస్తున్న సహాయాన్ని గ్రామస్తులు ప్రశంసించారు. తానా ఫౌండేషన్ సహకారంతో తాను ల్యాప్టాప్లను పేద విద్యార్థులకు అందజేసినట్లు సుబ్బారాయుడు తెలిపారు. గుంటూరులో ఇంజనీరింగ్ విద్యార్థినులకు ల్యాప్టాప్లు తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.













