‘తానా’ ధీం తానా పోటీలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) రెండేళ్ళకోమారు నిర్వహించే మహాసభలకు ముందు అమెరికాలోని అన్నీ నగరాల్లో నిర్వహించే తానా ధీంతానా కార్యక్రమం వర్జీనియాలో జూన్ 8వ తేదీ నుంచి ప్రారంభం కానున్నది. ఈ ధీంతానాకు సాయిసుధ పాలడుగు చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. సోలోసింగింగ్, గ్రూపు డ్యాన్సింగ్, కపుల్ డ్యాన్స్, మిస్ టీన్ తానా, మిస్ తానా, మిసెస్ తానా విభాగాల్లో పోటీలు జరుగుతాయి. వివిధ వయస్సులవారికి విడివిడిగా పోటీలు జరుగుతాయి. వివిధ నగరాల్లో పోటీలను నిర్వహించిన తరువాత ఫైనల్ పోటీలను తానా కాన్ఫరెన్స్ వేదికపై జూలై 4,5,6 తేదీల్లో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని వివరాలకు ఫ్లయర్‌ను చూడండి.













