TANA: ఆకట్టుకునేలా తానా కల్చరల్ ప్రోగ్రామ్స్
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) 24వ ద్వై వార్షిక మహాసభలు జూలై 3 నుంచి 5వ తేదీ వరకు డిట్రాయిట్ సబర్బ్ నోవైలో ఉన్న సబర్బన్ కలెక్షన్ షోప్లేస్‌లో జరగనున్నది. ఈ మహాసభల్లో పలురకాల సాంస్కృతిక కార్యక్రమాలను కల్చరల్ కమిటీ ఏర్పాటు చేసింది. ఇండియా నుంచి వచ్చే కళాకారులతో, అమెరికాలో ఉన్న కళాకారులతో కలిసి ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రముఖ కూచిపూడి కళాకారుడు సత్యనారాయణ తానా మహాసభల కోసం అమెరికాకు వచ్చి 2 వారాలుగా దాదాపు 70 మందికి నృత్య ప్రదర్శనలో శిక్షణను ఇచ్చారు. తెలుగు వైభవం అనే నృత్యరూపకానికి ఆయన దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ కార్యక్రమం తానా మహాసభల్లో హైలైట్‌గా నిలుస్తుందని కల్చరల్ కమిటీ వాళ్ళు పేర్కొంటున్నారు. అలాగే ఇండియా నుంచి కూడా కూచిపూడి నృత్య కళాకారులు ఈ మహాసభల్లో ప్రదర్శనలు ఇవ్వనున్నారు. అలాగే వేర్వేరు థీమ్స్‌తో సినిమా పాటలను, నృత్యాలను ప్రదర్శించనున్నారు. రెండు రోజులపాటు వచ్చినవారికి పసందైన విందుగా కళా ప్రదర్శనలు కనిపిస్తాయని, మన సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా కార్యక్రమాలకు రూపకల్పన చేశామని కల్చరల్ కమిటీ కోచైర్స్ రమణ ముదేగంటి, స్వప్న చిల్ల తెలిపారు.







