సంబరంగా సాగిన తానా నౌకా (క్రూజ్) విహారయాత్ర
న్యూయార్క్ నగరం లోని హడ్సన్ నది మీద ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మొదటిసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన నౌకా( క్రూజ్) విహారయాత్ర పండుగ విజయవంతంగా జరిగింది. ప్రెసిడెంట్ ఎలెక్ట్ జే తాళ్లూరి ఆధ్వర్యంలో, విద్యాధర్ గారపాటి (ఆర్సి న్యూయార్క్, న్యూ జెర్సీ) ఈవెంట్ కన్వీనర్ శిరీష తునుగుంట్ల రూపకల్పన చేసిన ఈ కార్యక్రమాన్ని తానా అధ్యక్షులు సతీష్ వేమన ప్రారంభించారు. హడ్సన్ నదీతీరపు అందాలు, ఆకాశాన్నంటే న్యూయార్క్ నగర కట్టడాల మధ్య ఉత్సాహంతో, ఉల్లాసంతో సాగిన ఈ క్రూజ్ షిప్లో నాలుగు వందల యాభై మంది తెలుగు ఎన్నారైలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
దాదాపు నాలుగు గంటల పాటు విహార యాత్ర సాగింది. తానా నాయకులు శ్రీ హరీష్ కోయ, (బోర్డ్ ఆఫ్ డైరెక్టర్), శ్రీవిశ్వనాథ్ నాయునిపాటి (ఆర్సి న్యూ ఇంగ్లండ్), శ్రీ నాగరాజు నలజాల( ఆర్సి మిడ్ అట్లాంటిక్), శ్రీరాజు కాసుకుర్తి మరియు తానా టీం (న్యూజెర్సీ ) వంశీ వాసిరెడ్డి, సుధీర్ నరవారిపాలెపు, శ్రీనివాస్ భక్తవరపు, రమేష్ అడుసుమిల్లి, ఎన్.ఆర్.సి.నాయుడు, పృథ్వీ, శైలజ చల్లపల్లి ఈ యాత్రలో పాల్గొన్నారు.
చక్కటి ఆహ్లాదరక వాతావరణంలో ఉదయం 12 గంటలకు ప్రారంభమైన ఈ యాత్ర మరచిపోలేని మధురానుభూతిని అందించింది. న్యూయార్క్ నగర అందచందాలను వీక్షిస్తూనే మరోపక్క ఆద్వంతం ఎస్పి బ్రదర్స్, ప్రసాద్ ఆధ్వర్యంలో గాయనీ గాయకులు అతిధి, శృతి నండూరి పాడిన పాటలకు బీట్ వేస్తూ అందరూ ఎంజాయ్ చేసారు. క్రూజ్ ప్రయాణం సాగినంత సేపు పిల్లలకు, పెద్దలకు ఏర్పాటు చేసిన వివిధ రకాలైన ఆట, పాటలలో అన్ని వయస్సుల వారు ఉత్సాహంగా పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు. భోజన విరామంలో హోరెత్తిన ఉత్సాహంతో తానా నాయకత్వం జన్మభూమి నాదేశం నమో నమామి కన్న తల్లి నా దేశం సదా స్మరామి అంటూ ప్రసాద్ వినిపించిన గీతంతో ప్రవాసాంధ్రులు జన్మభూమిని తలచుకొని ఉప్పింగిపోయారు.
తదనంతరం ప్రత్యేకంగా దక్కన్ స్పైస్ వారు ఆహుతులకు వడ్డించిన రుచికరమైన భోజనం మరియు తేనీరు సేవించి ఆనందానుభూతి పొందారు. అనంతరం డెక్ మీద కిక్ తో అందరూ ప్రకృతి అందాలను తిలకిస్తూ, న్యూయార్క్ ఆకాశ హార్మ్యాలను ఫోటోలలో బంధిస్తూ తమ కుటుంబసభ్యులతో ఉల్లాసంగా గడిపారు.
కార్యక్రమంంలో పాల్గొన్న తానా అధ్యక్షులు శ్రీ సతీష్ వేమన ఆహుతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ న్యూయార్క్ నగరంలో తానా టీం చేపట్టిన ఈ కార్యక్రమం తెలుగువారి ఐక్యత, ప్రేమాభిమానాలకు నిదర్శమని, ఇంతమంది పెద్దలు, మరియు ఇతర సంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొని వేడుక చేసుకోవడం ఏంతో సంతోషదాయకమని ఈ కార్యక్రమాన్ని చేపట్టిన న్యూయార్క్, న్యూ జెర్సీ టీం ప్రతినిధులను ప్రత్యేకించి జయ్ తాళ్లూరి, విద్యాధర్ గారపాటి, కన్వీనర్ శిరీష తునుగుంట్ల ను అభినందించారు. తానా మాజీ అధ్యక్షులైన దశరథరామిరెడ్డి, తిరుమలరావు తిప్పిర్నేని, రాఘవ రావు, టి.ఎల్.సి.ఏ.బోర్డు ఆఫ్ ట్రస్టీస్, శ్రీనివాస్ గూడూరు, టి.ఎల్.సి.ఏ అధ్యక్షులు మరియు ఈ కార్యక్రమ విజయానికి కృషి చేసిన తానా టీం ప్రతినిధులను కూడా సన్మానించారు.
ప్రెసిడెంట్ ఎలెక్ట్ జే తాళ్ళూరి మాట్లాడుతూ నాలుగు తరాల తానా నాయకులతోపాటు, టి.ఎల్.సి.ఏ టాటా, ఆటా ప్రతినిధులు కలసి ఈ యాత్రలో పాల్గొని అభినందనలు తెలియజేయడం సంతోషాన్నిచ్చిందని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మాధవరెడ్డి (టాటా డైరెక్టర్), శ్రీమతి కృష్ణ శ్రీ, రంజీత్ లకు (టాటా) టి.ఎల్.సి.ఏ విశ్రాంత అధ్యక్షులు సత్య చల్లపల్లి, రావు ఓలేటి, సుమంత్ రాంశెట్టి, హరిశంకర్, సురేష్, అశోక్ చింతకుంట, కిరణ్ పర్వతాల, సాయి జరుగుల, ధ్రువ నాగండ్ల, ప్రసాద్ కునిపెట్టి లకు కృతజ్ఞతలు తెలియజేసారు.
విద్యాధర్ గారపాటి మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం తానా గర్వంగా భావిస్తున్నదని విచ్చేసిన ఆహుతులందరికీ ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు. కార్యక్రమ విజయానికి కృషి చేసిన న్యూయార్క్, న్యూజెర్సీ తానా ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ఈవెంట్ కన్వీనర్ శిరీష న్యూయార్క్ టీం సభ్యులు, వాలంటీర్లు కలసికట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తీరు ఆదర్శనీయమంటూ భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని ఉత్సాహవంతమైన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.













