తానా న్యూజెర్సి టీమ్ ఆధ్వర్యంలో సిపిఆర్ శిక్షణ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) న్యూజెర్సి టీమ్ ఆధ్వర్యంలో సీపిఆర్-ఎఇడి శిక్షణ కార్యక్రమాన్ని డిసెంబర్ 15వ తేదీన న్యూజెర్సిలోని సౌత్ బ్రన్స్విక్లో నిర్వహించారు. ఈ సందర్భంగా హార్ట్?అటాక్, కార్డియాక్ అరెస్ట్, స్ట్రోక్ వచ్చినప్పుడూ చేయాల్సిన అత్యవసర చికిత్స విధానాన్ని అందరికీ నేర్పించారు. ఈ?సందర్భంగా ప్రదర్శించిన వీడియో శిక్షణ అందరినీ ఆకట్టుకుంది. తానా అధ్యక్షుడు జే తాళ్ళూరి, తానా కమ్యూనిటీ సర్వీసెస్ కో ఆర్డినేటర్ మల్లి వేమన, తానా ప్రెసిడెంట్ ఎలక్ట్ అంజయ్య చౌదరి లావు, తానా ఇంటర్నేషనల్ కో ఆర్డినేటర్ లక్ష్మీదేవినేని, రాజేష్ అడుసుమిల్లి ప్రోత్సాహంతో న్యూజెర్సి తానా టీమ్ ఈ?కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. రవి కామరసు, సుధీర్ తదితరలు ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించారు. దాదాపు 100 మందికి ఇప్పటివరకు శిక్షణ ఇచ్చామని, ఆరు నెలల్లోగా 500 మందికి శిక్షణ?ఇవ్వాలని టార్గెట్గా పెట్టుకున్నట్లు తానా నాయకులు పేర్కొన్నారు.













