చంద్రబాబునాయుడు కు తానా ఆహ్వానం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సహకారంతో తిరుపతిలో అత్యున్నత ప్రమాణాలతో నిర్మించిన గ్యాస్ ఆధారిత స్మశానవాటిక “గోవిందధామం” ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారిని ఆహ్వానించడానికి ఈ రోజు తానా పూర్వాధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాంగారు, తానా పత్రిక ప్రధాన సంపాదకులు కేసీ చేకూరి, తానా ఫౌండేషన్ చైర్మన్ నిరంజన్ శృంగవరపు, తానా ప్రాంతీయ ప్రతినిధులు రఘు మేకా, విశ్వనాథ్ నాయునిపాటి, తానా Committee Members సుధీర్ చింతమనేని, రాకేష్ బత్తినేని బృందంతో అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసాము. మొత్తం మూడుకోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ మహాప్రస్థానం అత్యాధునిక సదుపాయాలతో, పచ్చదనంతో, పురుషులకు, మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లతో ఒక దేవాలయాన్ని తలదన్నేరీతిలో నిర్మితమయింది. దీని నిర్మాణ వివరాలను, ప్రత్యేకతలను ఫోటో ఆల్బం ద్వారా ముఖ్యమంత్రికి వివరించాము. తానా తరపున 30 లక్షల చెక్కును ముఖ్యమంత్రికి అందజేశాము.













