తానా చెస్, క్యారమ్స్ టోర్నమెంట్

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో చెస్, క్యారమ్స్ పోటీలను నిర్వహిస్తున్నారు. మార్చి16 మధ్యాహ్నం 12 గంటల నుంచి నోవిలోని శ్రీ వేంకటేశ్వర టెంపుల్ లో ఈ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలను డిట్రాయిట్ తెలుగు అసోసియేషన్ తో కలిసి ఏర్పాటు చేశారు. క్యారమ్స్ పోటీలను సింగిల్స్, డబుల్స్ విభాగంలో నిర్వహిస్తున్నారు. చెస్ టోర్నమెంట్ ను వివిధ వయస్సుల వారీగా విభజించి నిర్వహిస్తున్నారు.
6 నుంచి 9 వయస్సు కలవారికి, 9 నుంచి 12 సంవత్సరంలోపు వయస్సు ఉన్నవారికి, 12 నుంచి 16 మధ్య ఉన్న వయస్సు కలవారికి, 16 కు పైన వయస్సు ఉన్నవారికి పోటీలను ఏర్పాటు చేశారు. వివిధ వయస్సులవారీగా నిర్వహించే చెస్ పోటీల్లో గెలిచిన వారికి, క్యారమ్స్ పోటీల్లో గెలిచినవారికి బహుమతులను కూడా ప్రదానం చేయనున్నట్లు తానా నార్త్ రీజినల్ రిప్రజెంటేటివ్ నీలిమ మన్నె, తానా స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ నాగ పంచుమర్తి తెలిపారు.
తానా జాయింట్ ట్రెజరర్ సునీల్ పంట్ర, డిటిఎ ప్రెసిడెంట్ కిరణ్ దుగ్గిరాల ఈ పోటీలకు సహకరిస్తున్నారు. ఇతర వివరాలకు రాజా తొట్టెంపూడిని 510 862 6399లో, మంజీరను 313 515 3298లో సంప్రదించవచ్చు.