పోటాపోటీగా సాగిన తానా-బాటా వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా) కలిసి సంయుక్తంగా వార్షిక వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్‌ను నెవార్క్లో సెప్టెంబర్ 11, 2021న నిర్వహించాయి. నెవార్క్‌లోని యాష్స్ట్రీట్ పార్క్‌లో ఉదయం 8 నుంచి రాత్రి 7వరకు కొనసాగింది. దాదాపు 35 టీమ్‌లు ఇందులో పాల్గొన్నాయి. 200 మందికిపైగా ఆటగాళ్ళు ఇందులో పాల్గొన్నారు. అడ్వాన్స్డ్, ఇంటర్మీడియేట్, రిక్రియేషన్ గ్రూపుగా విభజించి, పురుషులు, మహిళల టీమ్‌లకు వేర్వేరుగా పోటీలను నిర్వహించారు. ఆటను చూసేందుకు వచ్చిన ప్రేక్షకులతో పార్క్ నిండిపోయింది. పోటీలు రసవత్తరంగా సాగాయి. తానా రీజినల్ రిప్రజెంటేటివ్ (నార్తర్న్ కాలిఫోర్నియా) రామ్‌తోట, తానా సెక్రటరీ సతీష్ వేమూరి, బాటా ప్రెసిడెంట్ హరినాథ్ చికోటి, బాటా అడ్వయిజర్ ప్రసాద్ మంగిన, వీరు ఉప్పల పోటీల్లో పాల్గొన్న ఆటగాళ్ళందరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేశారు. ఈ టోర్నమెంట్ ద్వారా వచ్చిన నిధులను చారిటీ కార్యక్రమాలకు వినియోగించనున్నారు. తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు ఈ సందర్భంగా తానా, బాటా టీమ్‌లను అభినందించారు. మురళి గొడవర్తి, భార్గవ్ సి, హరి నల్లమల, శ్రీనివాస్ వీరపనేని, శ్రీకాంత్ కోనేరు, శాస్త్రీ లాల్, జే.పి. వేజెండ్ల, శ్రీధర్ పంచుమర్తి, ఆజాద్, వినయ్ పరుచూరి, శ్రీధర్ చావా, శ్రీని వల్లూరిపల్లి, మైక్ బండ్ల, వివేక్, వీరబాబు, రెడ్డయ్య, శ్రీధర్ రెడ్డితోపాటు కొండల్రావు, కరుణ్ వెలిగేటి, రమేష్ కొండ, యశ్వంత్ కుదరవల్లి, శివకద, ఆది, హరీష్, ఉదయ్, క్రాంతి తదితరులు ఈ టోర్నమెంట్ విజయవంతానికి కృషి చేశారు. బాటా ప్రెసిడెంట్ హరినాథ్ చికోటి మాట్లాడుతూ, ఈ టోర్నమెంట్‌కు ఇంత పెద్దఎత్తున మంచి స్పందన ఇచ్చినందుకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బాటా నాయకులను, టీమ్‌ను అభినందించారు. ప్రీమాంట్ కౌన్సిల్ మెంబర్ రాజ్ సల్వాన్ ఈ టోర్నమెంట్‌కు హాజరై తానా, బాటా టీమ్‌లను అభినందించారు. విజేతలకు ట్రోపీలను అందించారు.
సంజయ్ ట్యాక్స్ ప్రో, అపెక్స్ కన్సల్టింగ్, శ్రీనిగోలి రియల్ ఎస్టేట్, పిఎన్జి జ్యూవెల్లర్స్, దంకిన్, శ్రీధర్ సిపిఎ, ఆజాద్ ఫైనాన్షియల్ సర్వీసెస్, స్వాగత్, మల్లిక్ రియల్టర్, రైట్ప్రోస్, పాఠశాల తెలుగు స్కూల్ స్పాన్సర్లుగా వ్యవహరించారు. ఘుమఘుమలు ఫుడ్ స్పాన్సర్‌గా వ్యవహరించింది.
రామ్‌తోట మాట్లాడుతూ, ఈ టోర్నమెంట్ నిర్వహణలో పాల్గొన్న టీమ్‌లను, ఆటగాళ్ళను, నిర్వహణకు సహకరించిన తానా నాయకులకు, వలంటీర్లకు ధన్యవాదాలు తెలిపారు. స్పాన్సర్లకు కూడా ధన్యవాదాలు చెప్పారు.













