శాన్ఫ్రాన్సిస్కోలో తానా బ్యాగ్‌ల పంపిణీ
కమ్యూనిటీకి తిరిగి ఇవ్వడం మరియు పాఠశాల పిల్లలకు మద్దతు ఇవ్వడం ఆనే సంప్రదాయాన్ని కొనసాగించడంలో భాగంగా తానా నార్తర్న్ కాలిఫోర్నియా బృందం (శాన్ ఫ్రాన్సిస్కొ, బే ఏరియా) కాలిఫోర్నియా, మిల్పిటాస్లోని రాబర్ట్ రాండాల్ ఎలిమెంటరీ స్కూల్లో బ్యాక్‌ప్యాక్‌లను పంపిణీ చేసింది. 250కి పైగా బ్యాక్ ప్యాక్‌లను తానా ఉదారంగా విరాళంగా అందించినందుకు స్కూల్ మేనేజ్మెంట్ (కో-ప్రిన్సిపల్స్ శ్రీమతి క్రిస్టన్-శ్రీమతి క్లాడియా) మరియు స్టూడెంట్ కౌన్సిల్ (ప్రెసిడెంట్ కైకో అండ్ టీమ్) సంతోషం వ్యక్తం చేశారు. ఈ గొప్ప విరాళాల కార్యక్రమం ద్వారా పాఠశాలకు తమ నిరంతర మద్దతు కొనసాగిస్తున్నందుకు తానా నార్తర్న్ కాలిఫోర్నియా బృందానికి, తానా రీజినల్ రిప్రజెంటేటివ్ రామ్ తోటకు వారు ధన్యవాదాలు తెలిపారు.













