తానా – మంచి పుస్తకం పుస్తకాల ఆవిష్కరణ బహుమతి ప్రదానం
తానా, మంచి పుస్తకం కలసి పిల్లల కోసం తెలుగులో రచనలు ప్రోత్సహించే కార్యక్రమాన్ని 2017లో మొదలుపెట్టాం. రెండేళ్లకి ఒకసారి చేపట్టే ఈ పనిలో ఈ సంవత్సరం పది బొమ్మల కథల పుస్తకాలు, 5 నవలలు అచ్చు అయ్యాయి (మూడు దఫాలలో మొత్తం 41 పుస్తకాలు వచ్చాయి.). కోవిద్ నేపధ్యంలో అనేక కారణాల వల్ల ఈసారి వీటి ప్రచురణ ఆలస్యం అయ్యింది. అందుకే రెండింటికీ కలిపి ఒకేసారి పుస్తకావిష్కరణ కార్యక్రమం పెట్టుకున్నాం.
తారీకు- 14 నవంబరు, 2021 (బాలల దినోత్సవం)
సమయం – సాయంత్రం 6 గంటల నుండి
వేదిక – దొడ్డి కొమురయ్య హాల్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగంపల్లి, హైదరాబాదు.
అందరికీ ఆహ్వానం.













