తానా అర్కాన్సాస్ సమ్మర్ స్పోర్ట్స్ ఫెస్టివల్….

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), అర్కాన్సాస్ సమ్మర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ మళ్ళీ వచ్చింది… ఆటలు… ఆటగాళ్ళ ప్రదర్శనలతో మిమ్మల్ని మైమరపింపజేసేందుకు వివిధ రకాల ఆటల పోటీలను తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు సారధ్యంలో తానా స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ నాగ పంచుమర్తి మరియు రాజ్ యార్లగడ్డ స్పోర్ట్స్ చైర్ నేతృత్వంలో లోకల్ తానా అరకాన్సస్ తానా టీం ఆధ్వర్యం లో నిర్వహించనున్నారు. టెన్నిస్, బ్యాడ్మింటన్, వాలీబాల్, త్రోబాల్ మరియు కిడ్స్ టోర్నమెంట్లను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. అన్ని వయస్సులవారు పాల్గొనేలా ఈ పోటీలు జరుగుతాయని నాగ పంచుమర్తి తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న తానా నాయకుల సహకారంతో జరిగే ఈ పోటీల్లో అందరూ పాల్గొనాలని ఆయన కోరారు.
తానా-ఆర్కాన్సాస్ టెన్నిస్ టోర్నీలో పురుషుల డబుల్స్ విభాగం మ్యాచులు ఆగస్టు 11 నుంచి 3 వరకు, ఆ తర్వాత ఆగస్టు 25 నుంచి 27 వరకు జరగనున్నాయి. ఇక మిక్స్డ్ డబుల్స్ విభాగం పోటీలు ఆగస్టు 18-20 మధ్య జరుగుతాయి. 8 నుంచి 14 సంవత్సరాల వయసున్న చిన్నారుల మధ్య కిడ్స్ సింగిల్స్ పోటీలు ఆగస్టు 18-20 మధ్య జరగనున్నాయి. ఈ పోటీల క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్ సెప్టెంబర్ 8-10 మధ్య జరుగుతాయని తానా తెలిపింది.