దామా వెంకయ్య మృతికి తానా, తెలుగుటైమ్స్ సంతాపం
తానా మొదటితరం నాయకుడైన దామా వెంకయ్య మృతిపట్ల తానా అధ్యక్షుడు జయశేఖర్ తాళ్ళూరి సంతాపం వ్యక్తం చేశారు. న్యూయార్క్ లోని ఫ్లషింగ్‌లో ఉంటున్న దామా వెంకయ్య (85) తానాలో వివిధ హోదాల్లో కమ్యూనిటికీ సేవ చేశారు. 1997-99లో తానా ఫౌండేషన్ చైర్మన్‌గా వ్యవహరించారు. టిఎల్సిఎలో కూడా ఆయన చురుకైన పాత్ర పోషించారు. 1968లో ఆయన యుఎస్ఎ వచ్చారు. 2005వరకు న్యూయార్క్ సిటీలో సివిల్ ఇంజనీర్‌గా పనిచేశారు.
తెలుగుటైమ్స్ తో కూడా ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. తెలుగుటైమ్స్ పత్రిక వివరాలను ఆయన ఎప్పటికప్పుడు ఎడిటర్ చెన్నూరి వెంకటసుబ్బారావును అడిగి తెలుసుకునేవారు. న్యూజెర్సిలోనూ, ఇతర తానా కాన్ఫరెన్స్ సమయాల్లో ఆయన ప్రత్యేకంగా తెలుగు టైమ్స్ గురించి అడిగి మరీ పత్రికను చూసేవారు. ఆయన మరణం పట్ల తెలుగు టైమ్స్ ఎడిటర్ చెన్నూరి వెంకట సుబ్బారావు సంతాపం వ్యక్తం చేశారు.













