నిరుపేద యువకునికి తానా, సామినేని ఫౌండేషన్ ఆదరణ
ఖమ్మం రాపర్తి నగర్ ప్రాంతానికి చెందిన పాపినేని సుధీర్ కుమార్ అనే నిరుపేద కుటుంబానికి TANA 2లక్షల70 వేలు విలువైన బజాజ్ ఆటోను అందించి చేయూతను అందించింది. దీనిని శుక్రవారం రాత్రి ఖమ్మం జిల్లా కలెక్టర్ శ్రీ గౌతమ్ కుమార్ లబ్ధిదారునికి అందించారు. దాతలు నమ్మకంతో అందించిన సాయాన్ని కుటుంబ పోషణకు పిల్లల చదువుకు ఉపయోగించాలని, సాయాన్ని అందించిన తానా బృందాన్ని ఆయన అభినందించారు. చింతకాని మండలం నాగులవంచకు చెందిన పాపినేని సుధీర్ డిగ్రీ చదివి ఉపాది కొరకు ఖమ్మం చేరుకున్నాడు. కూలిపనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న క్రమము లో ఆక్సిడెంట్ కు గురై బరువులు ఎత్తటమే కాదు ఎక్కువ సేపు నిలబడలేని స్థితికి చేరుకున్నాడు. డ్రైవింగ్ తెలిసినా పనులు దొరక్క చివరకు సామినేని నాగేశ్వరరావు గారు ద్వారా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) వారిని అభ్యర్ధించాడు.
ఈ క్రమంలో రవి సామినేనిగారిని సహాయాన్ని కోరగానే , తానా అధ్యక్షులు శ్రీ లావు అంజయ్య చౌదరి గారు, TANA ఫౌండేషన్ చైర్మన్ శ్రీ వెంకట రమణ యార్లగడ్డ గారు, సామినేని ఫౌండేషన్, తానా ఫౌండేషన్ సంయుక్తంగా రెండున్నర లక్షల తో ఒక బజాజ్ ఆటో కొని అందజేయడం జరిగింది. ఈ ఆటోను శుక్రవారం రాత్రి ఖమ్మం జిల్లా కలెక్టర్ శ్రీ గౌతమ్ కుమార్ ద్వారా సుధీర్ దంపతులకు అందజేయడం జరిగింది. సామినేని నాగేశ్వర్ రావు గారి పర్యవేక్షణలో కార్యక్రమంలో బండి నాగేశ్వరరావు, వాసిరెడ్డి అర్జునరావు, శ్రీ పారుపల్లి రామలింగేశ్వర రావు గారు, శ్రీ విజయ గారు, సుధాకర్, శ్రీ విజయ్ కుమార్ పాటిబండ్ల గారు పాల్గొన్నారు.













