ఒహాయో తానా బ్యాడ్మింటన్ పోటీలు…సింధు టీ షర్టుల వేలం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), నార్త్ ఈస్ట్ ఒహాయో తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్చి 2వ తేదీన ప్రి క్లీవ్‌లాండ్ బ్యాడ్మింటన్ లీగ్ పోటీలు జరగనున్నాయి. ఈ లీగ్ పోటీల్లో భాగంగా ఉమెన్, మెన్ డబుల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌కు ఎన్నో జట్లు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. టాప్ 3 టీమ్‌లకు అవార్డులు, మెడల్స్ బహూకరిస్తారు.
మార్చి 2వ తేదీన ఈ జరిగే టోర్నమెంట్లో మరో విశేషం ఉంది. భారత ఆర్మీకి మద్దతుగా విరాళాల సేకరణ కోసం బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధు స్వయంగా సంతకం చేసిన టీ షర్టులను ఈ టోర్నమెంట్లో వేలం వేయనున్నారు. వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని భారత ఆర్మీ సంక్షేమ నిధికి అందజేస్తారని తానా నాయకుడు అశోక్ బాబు కొల్లా చెప్పారు.













