TANA: ప్రారంభమైన తానా 2025 మహాసభలు… నిష్ణాతులకు అవార్డులు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) 24వ ద్వై వార్షిక మహాసభలు డిట్రాయిట్ సబర్బ్ నోవైలో ఉన్న సబర్బన్ కలెక్షన్ షోప్లేస్ లో వైభవంగా ప్రారంభమైంది. బాంక్వెట్ కార్యక్రమంతో మహాసభలు ప్రారంభమయ్యాయి. తానా కాన్ఫరెన్స్ చైర్మన్ గంగాధర్ నాదెళ్ళ, కన్వీనర్ ఉదయ్ కుమార్ చాపలమడుగు ఆధ్వర్యంలో కార్యక్రమాలు సాగాయి. ఈ సందర్భంగా పలు విభాగాల్లో సేవలందించిన వారికి తానా మెరిటోరియస్ అవార్డులను బహుకరించారు.
సైంటిఫిక్ రీసెర్చ్, ఎంట్రప్రెన్యూర్ షిప్ లో ప్రతిభ చూపినందుకుగాను డా. బెజవాడ శ్రీనివాసరావుకు అవార్డును బహకరించారు. మెడిసిన్ విభాగంలో డాక్టర్ ముక్కామల శ్రీనివాస్ కు అవార్డును ఇచ్చారు. లిటరేచర్ విభాగంలో తానాఎక్సలెన్స్‌అవార్డును డాక్టర్ వడ్లమూడిబాబుకు అందించారు. అకాడమిక్ ఆచీవ్‌మెంట్స్‌కుగాను నాదెళ్ళ ప్రణయ్ కు, ఫైనాన్షియల్ టెక్నాలజీ రంగంలో ప్రతిభ చూపిన యార్లగడ్డ రఘుకు, పొలిటికల్ విశ్లేషకుడు ఆది సతికి, మెడిసిన్,కమ్యూనిటీ సర్వీస్ కు గాను డా. కాకర్ల జగన్మోహనరావుకు, సాహిత్యవిభాగంలో ప్రసాద్ తోటకూరకు, తెలుగు బ్రాడ్ కాస్టింగ్ లో ఉదయగిరి రాజేశ్వరికి, మెడిసిన్, జీన్ థెరపికి గాను డాక్టర్ ముసునూరు కిరణ్‌కు, ఫైనాన్స్ టెక్నాలజీలో డాక్టర్ పరుచూరి శ్రీనివనాస్‌కు, సర్వీస్ విభాగంలో డా. నల్లమోతు బ్రహ్మాజీకి, ఎడ్యుకేషన్, కమ్యూనిటీ సర్వీస్‌లో డా. చెరుకుపల్లి నెహ్రూకు, అగ్రికల్చర్ విభాగంలో పాతూరి నాగభూషణంకు, కమ్యూనిటీ సర్వీస్ లో తిపిర్నేని తిరుమలరావుకు, ఆర్ట్స్ విభాగంలో శ్రీమతి ఆసూరి విజయకు, కళల విభాగంలో శ్రీమతి సంధ్యశ్రీ ఆత్మకూరికి, మెడిసిన్, మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలో డా. కొట్టమసు సాంబశివరావుకు, కమ్యూనిటీ సర్వీస్ విభాగంలో కోగంటి సునీల్ కు, ఎడ్యుకేషన్, కమ్యూనిటీ సర్వీస్ విభాగంలో గోరంట్ల వాసు బాబుకు, సినిమా క్రాప్ట్స్ అండ్ ఆర్ట్స్ విభాగంలో మిరియాల అరుణ్‌కు, తానా ప్రత్యేక ప్రశంస అవార్డును కొడాలి నరహరికి, చెరుకూరి రవి, వంకాయలపాటి శ్రీనివాస్‌కు అవార్డులను బహకరించారు.







