తామా సాహితీ సదస్సు
సాహితీవేత్తలు: డా. పాపినేని శివశంకర్ గారు మరియు డా. గాలి గుణశేఖర్ గారు.
ఎప్పుడు: ఈ శనివారం జూన్ 10న సాయంత్రం 3:30 – 5:00.
ఎక్కడ: తామా ఆఫీస్ – 5490 McGinnis Village Place, Suite 229, Alpharetta, GA – 30005.
చర్చ అంశాలు:
– ప్రాచీన ఆధునిక కవిత్వాలు / రజనీగంధ
– చాటు కవిత్వం
తేనీయ విందు అందించబడును.
డాక్టర్ పాపినేని శివశంకర్ గారు ఒక సుప్రసిద్ధ కవి, కథకులు, మరియు విమర్శకులు. ఆయన రచించిన రజనీగంధ అనే కవితా సంపుటికి భారత కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 21 2016న కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ప్రకటించింది. 350 కవితలు, 55 చిన్న కథలు, మరియు 220 వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. వాసిరెడ్డి నవీన్ గారితో కలిసి 1990 నుంచి తెలుగు ఉత్తమ కథా సంకలనాలను కథా సాహితి పేరుతో ప్రతి సంవత్సరం ప్రచురిస్తున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం నుంచి 2000 సంవత్సరంలో సాహితీ పురస్కారం పొందారు.
డా. గాలి గుణశేఖర్ గారు తెలుగు/తమిళ్/ఇంగ్లీష్ లో MA డిగ్రీ పుచ్చుకున్న ఒక విలక్షణమైన సాహితీవేత్త, లెక్చరర్, రీడర్, మరియు ప్రిన్సిపాల్. అష్టావధానం, సంగీత గేయధార, గణిత అష్టావధానం లాంటి కార్యక్రమాలు 150కి పైగా చేసారు. వందలకొద్దీ సాహితీ ఉపన్యాసాలు మరియు 102 రేడియో కార్యక్రమాలు చేసారు. అలాగే తెలుగు పుస్తకాల రచన, తమిళంలో తర్జుమా, మరెన్నోపద్యాలు, భాషా పరిశోధనలు చేసిన గొప్ప సాహితీవేత్త.













