తామా పర్వతారోహణ (హైకింగ్) యాత్ర: ఆరోగ్య అవగాహనలో క్రొత్త ఒరవడి
తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (టామా) 2020 మార్చి 1, ఆదివారం తొలిసారిగా పర్వతారోహణ (హైకింగ్) యాత్రని నిర్వహించింది. ఆరోగ్యం, శారీరక శ్రమ మరియు వ్యాయామంపై అవగాహన పెంచడం ఈ క్రొత్త ప్రయత్నం యొక్క ముఖ్యోద్దేశం. తామా స్పోర్ట్స్ & యూత్ సెక్రటరీ రమేష్ వెన్నలకంటి స్వాగతోపన్యాసంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. జార్జియా లోని సానీ పర్వతం వద్ద ఉదయం 7:30 గంటలకు ప్రారంభమైన పర్వతారోహణ 10 గంటలకు ముగిసింది. కొండ పైకి వెళ్లి దిగిరావటానికి మొత్తం దూరం సుమారు 3 మైళ్ళు. ఈ కార్యక్రమంలో 80 మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు. నమోదు చేసుకున్న మొదటి 50 మందికి తామా వారు ఏకో ఫ్రెండ్లీ పునర్వినియోగ నీటి సీసాలను పంపిణీ చేశారు.
చిన్నవారు, పెద్దవారు, మొదటి సారి పర్వతారోహణ చేసేవారు, నిపుణులు అందరూ కలిసి ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. చాలా మంది తమ కుటుంబాలతో మరియు స్నేహితులతో విచ్చేసి, సరదాగా నడవటం కనిపించింది. ఈ రకమైన యాత్ర మన తరానికి మరియు భవిష్యతరాలకు అన్ని కోణాల్లో ఉపయోగ పడుతుంది. సర్వజన ప్రయోజనకర కార్యక్రమాల నిర్వహణలో తామా ఎప్పుడూ ముందు ఉంటుంది. విచ్చేసిన అందరికీ అల్పాహారం మరియు తేనీరు అందించారు. తామా వారు ఇలాంటి విన్నూత్న కార్యక్రమాలు చేపట్టడాన్ని అందరూ ప్రశంసించారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావటానికి కృషి చేసిన తామా నాయకత్వం భరత్ మద్దినేని, భరత్ అవిర్నేని, హితేష్ వడ్లముడి, రూపేంద్ర వేములపల్లి, శుశృత్ రెడ్డి బుసిరెడ్డి, రాజశేఖర్ చుండురి, శ్రీనివాస్ ఉప్పు, శివదేవభక్తుని , నాగేష్ దొడ్డాక, వాలంటీర్లు రాజేష్ జంపాల, అంజయ్య చౌదరి లావు, హేమంత్ వర్మ పెన్మెట్స, మురళి బొడ్డు, అనురాగ్ బండ్ల, ఉపేంద్ర నర్రా, వినయ్ మద్దినేని, నరేంద్ర సూరపనేని, మోనిష్ జంపాల, తనీష్ జంపాల మరియు విచ్చేసిన అందరికీ రమేష్ కృతజ్ఞతలు తెలిపి దిగ్విజయంగా ముగించారు.













