తెలుగోళ్ల మనసు దోచుకున్న చిరంజీవి!
చిరంజీవి పేరు తెలుగు వారికి ప్రీతిపాత్రం. వినీలాకాశంలో ధ్రువ తారలా వెలిగి పోతున్న చిరంజీవి ఈ చిరంజీవి కానప్పటికీ చిరంజీవి గొంప కళామతల్లికి ముద్దుబిడ్డ, కళాసేవలో పునీతం అవుతున్న కళాభిమాని. కొన్ని వందల తెలుగు కుటుంబాలకు నెలవు టేనస్సీ రాష్ట్రంలోని మెంఫిస్ మహాపట్టణం. కాళీర్వీల్లె, జర్మన్ టౌన్ మరియు పట్టణాల్లోని ప్రవాస తెలుగు వారి ఆటకి పాటకి, విందుకి, వినోదానికి చిరునామా మెంఫిస్ తెలుగు కళాసమితి. నూతన సంవత్సర వేడుకలు, సంక్రాంతి సంబరాలు, ఉగాది ఉత్సవాలు, దసరా, బతుకమ్మ, వనభోజనాలు, ఇలా సంవత్సరం పొడుగూతా తెలుగు వారికీ 1981 నుండి యెనలేని సేవ చేస్తున్న సంస్థ మెంఫిస్ తెలుగు సమితి 2018 అధ్యక్షులుగా చిరంజీవి గొంప చేపట్టారు.
ఇటీవల కాళీర్వీల్లె హైస్కూల్లో తెలుగు కళాసమితి సంక్రాంతి వేడుకలు కొన్ని వందల తెలుగు కుటుంబాల సంబరాలుగా నిర్వహించారు. దీప ప్రజ్వలనంతో ప్రారంభమయి ప్రార్థన గీతం, చిన్నారులకి భోగిపళ్లు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో వయస్సుతో నిమిత్తం లేకుండా పిన్నలు పెద్దలు సాంప్రదాయ, జానపద, సినీ గీతాలకి నృత్యాలు, చిన్న చిన్న నాటికలు, వినోద, హాస్య ఘట్టాలు, అనుకరణలు ప్రేక్షకులకి కనువిందు చేయడంతో పాటు కావలసినంత ఆహ్లాదాన్ని అందించాయి. మెహెర్ చంటి డ్రమ్స్ వాయిద్య విన్యాసం ప్రత్యేక ఆకర్షణ.
సంక్రాంతి సంబరాలు అంటే అందరిని ఆకట్టుకునే సాంస్కృతిక కదంబం. మల్లెల్ని, మరువాన్ని దండగా కూర్చినట్లు వివిధ ప్రదర్శనల్ని వరుస క్రమంలో చక్కగా అమర్చారు కల్చరల్ సెక్రటరీ రాజు పెరిచర్ల మరియు జాయింట్ కల్చరల్ సెక్రటరీ వసంత పెరి.
ఝాన్సీ మరియు స్రవంతి ఆద్యంతం కార్యక్రమాన్ని చక్కని పలకరింపులతో, ఛలోక్తులతో, పాటలతో, చక్కనైన కీర్తనాలాపనాలతో నడిపిన తీరు ఎంతో అభినందనీయం. మెంఫిస్ కర్రీ బౌల్ వారి తెలుగు వంటకాలతో భోజనం ఎప్పటిలానే మధురం. మొత్తానికి మెంఫిస్ తెలుగు సమితి సంక్రాంతి సంబరాలు నవరస భరితం.
37 సంవత్సరాలుగా ప్రవాస తెలుగు వారికీ ఆయువు పట్టుగా టేనస్సీ రాష్ట్రం మెంఫిస్ పట్టణంలో విశేష సేవలందిస్తున్న తెలుగు సమితి భాద్యతలు తీసుకొని సమర్ధవంతంగా నిర్వహిస్తున్న వారు చిరంజీవి గొంప, సందీప్ చిట్టి, సరితా కోసూరి, శరత్ జాగర్లమూడి, రాజేష్ వల్లూరి, రామచందర్ గోలి, లక్ష్మణ్ మారూరి, రాజు పెరిచర్ల, వసంత పెరి, శ్రీనాథ రెడ్డి తిరుమల రెడ్డి, వివేక్ చుక్క, ప్రవల్లిక ఉప్పుగంటి, దినేష్ కుమార్ మద్దాల, రాము బోట్ల, శ్రీధర్ బొంతి, ఫణి తీగలపల్లి, చైతన్య పారుపల్లి, నాగేంద్ర శీలం, జయ పట్టెలా, చక్రధర్ వడ్లమూడి, ఉదయ్ నట్రా, కిరణ్ పారుపూడి, ప్రభాకర్ వర్మ ముప్పల, వెంకట ప్రవీణ్ చింతమనేని మరియు కిరణ్మయి గిలెడి.
Dr. Ramana Vasili
Director, Spiritual Foundation Indian Ballet Theater
901-387-9646
ramanavvasili@hotmail.com;
http://www.spiritualfoundation.us/













