రెడ్ క్రాస్ సొసైటీ రక్తనిధికి రూ.5 లక్షల విరాళం : తాళ్లూరి
భద్రాచలం రెడ్ క్రాస్ సొసైటీకి తాళ్లూరి పంచాక్షరయ్య ట్రస్ట్ తరపున చేయూత అందింది. ఈ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న రక్తనిధికి అవసరమైన సామగ్రి కొనుగోలుకు రూ.5 లక్షలు అందజేశారు. స్థానిక మారుతి నర్సింగ్ కళాశాలలో డా.ఎస్ఎల్ కాంతారావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ట్రస్ట్ చైర్మన్ తాళ్లూరి పంచాక్షరయ్య, ప్రవాస భారతీయుడు డా.రాజా శ్రీకృష్ణ ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో అందించారు. గిరిజన ప్రాంతంలో నిరుపేదలు తలసేమియా, సికిల్సెల్, రక్తహీనత వంటి జబ్బులతో బాధపడుతూ అవసరమైన రక్తం లభించక అవస్థ పడుతున్నందున ఈ రక్తనిధిని సద్వినియోగం చేసుకోవాలని దాతలు కోరారు. మన్యం కేంద్రంలో ఇలాంటి సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమని వెల్లడించారు. తమ సంస్థ తరపు నుంచి రూ.5 లక్షలు అందించడం ఆనందంగా ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వల్లూరిపల్లి వంశీకృష్ణ, సీఐ సత్యనారాయణ రెడ్డి, డా.సుబ్బరాజు, డా.సుదర్శన్, చావా లక్ష్మీనారాయణ, వై.సూర్యనారాయణ, తిప్పన సిద్ధులు, పాకాల దుర్గాప్రసాద్, అల్లం నాగేశ్వరరావు, ఎన్సీహెచ్ చక్రవర్తి, జగదీశ్, రామరావు, సత్యనారాయణ పాల్గొన్నారు.













