వయాగ్రాతో బ్లడ్ షుగర్ కు ముప్పు
వయాగ్రా వాడకం వల్ల రక్తంలో చక్కెర (బ్లడ్ షుగర్) స్థాయి తీవ్రంగా పడిపోయే ప్రమాదం ఉన్నదని వర్జీనియా శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడైంది. డయాబెటిస్ ఉన్నవారికి ఇచ్చే సైల్డనాఫిల్, గ్లైబురైడ్ ఔషదాలు ఈ ట్యాబ్యెట్లలో ఉండటమే అందుకు కారణమని వారు తెలిపారు. ట్యాబ్లెట్లు ఎక్కువగా వాడితే మూర్ఛ, కోమాలోకి పోయే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రాణాలు కూడా పోవచ్చని హెచ్చరించారు. సాధారణంగా వయాగ్రా ట్యాబ్లెట్ ఫార్ములాలోని ఔషధాల వివరాలు ప్యాకెట్‌పై పేర్కొన్నారు. ఒక్క వయాగ్రా ట్యాబ్లెట్లో 55-156 మిల్లీ గ్రామ గ్లైబురైడ్ ఉంటుంది. ఇది డయాబెటిస్ రోగులకు ఇచ్చే డోసు కంటే 10 రెట్లు ఎక్కువ.













