TAGS ఆధ్యర్యంలో “శ్రీ UAN మూర్తి మెమోరియల్ 2వ రచనల పోటీ”
విదేశాల్లో నివసిస్తున్న ప్రవాస తెలుగువారి రచనలకు TAGS ఆహ్వానం
(మీ రచనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ: డిసెంబర్ 1, 2019)
రాబోయే సంక్రాంతి 2020 సందర్భంగా అమెరికా లో కాలిఫొర్నియా రాష్ట్ర రాజధాని నగరం అయినటువంటి శాక్రమెంటో లో నెలకొనిఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం (TAGS) “శ్రీ UAN మూర్తి మెమోరియల్ 2వ రచనల పోటీ “ నిర్వహిస్థుంది. భారత దేశం మినహా విదేశాలలో నివసిస్తున్న తెలుగు రచయితలందరినీ (ప్రవాస తెలుగు వారు) ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని సవినయంగా కోరుతున్నాం. మూడు వేలమందికి పైగా స్థానిక సభ్యులను కలిగి ఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం తెలుగు భాష, తెలుగు సంస్కృతి వ్యాప్తి కి 2003 సంవత్సరం నుండి శాక్రమెంటో పరిసర ప్రాంతాలలో విశేష కృషి చేస్తుంది. అమెరికా, కెనడా, యూరోప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, సింగపూర్, మలేసియా తదితర విదేశాలలో నివసించే తెలుగు రచయితలకు ఇదే మా ఆహ్వానం. స్నేహపూర్వకమైన ఈ రచనల పోటీలో రెండు విభాగాలు ఉన్నాయి.
1.“ప్రధాన విభాగం”
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక ప్రవాస తెలుగు రచయితల నుండి నూతన, అముద్రిత తెలుగు రచనలని ఈ పోటీకి ఆహ్వానిస్తున్నాం.
ఉత్తమ కథానిక: (మూడు బహుమతులు) ఒక్కొక్కటీ: $116, $58, $28
ఉత్తమ కవిత: (మూడు బహుమతులు) ఒక్కొక్కటీ: $116, $58, $28
మరియూ ప్రోత్సాహక బహుమతులు
2.“అనువాద కధ రచనా విభాగం (18 ఏండ్ల లోపు యువ రచయితలకు)”
ప్రవాస యువ రచయితలని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఈ ప్రత్యేకమైన విభాగంలో పోటీ నిర్వహిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా 18 ఏండ్ల లోపు వయసు ఉన్న ఔత్సాహిక ప్రవాస యువ తెలుగు రచయితలను ఈ తెలుగు రచనా విభాగం “పోటీ” లో పాల్గొనమని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. పోటీలో పాల్గొనే వారి వయస్సు డిసెంబర్ 1, 2019 నాటికి 18 ఏండ్లలోపు ఉండాలి.
ఉత్తమ అనువాద కధ – 13 ఏండ్ల లోపు వయస్సు ఉన్న యువ రచయితలకు: (మూడు బహుమతులు) ఒక్కొక్కటీ: $116, $58, $28
ఉత్తమ అనువాద కధ – 13 ఏండ్ల నుండి 18 ఏండ్ల లోపు వయస్సు ఉన్న యువ రచయితలకు: (మూడు బహుమతులు) ఒక్కొక్కటీ: $116, $58, $28
మరియూ ప్రోత్సాహక బహుమతులు
అన్ని పోటీలకీ ముఖ్య గమనికలు
- ఒక రచయితఒక్కో పోటీ లో ఒక ఎంట్రీ మాత్రమే పంపించవచ్చును. కథలు పది పేజీల లోపు, కవితలు ఐదు పేజీలు లోపుగా ఉండాలి. పేజీ గరిష్ఠ కొలత 8.5 అంగుళాలు X 11 అంగుళాలు ఉండాలి. తమకు నచ్చిన ఇతివృత్తం రచయితలు ఎన్నుకోవచ్చును.
- రచయితల అముద్రిత స్వీయ రచనలు మాత్రమే పరిశీలనకు స్వీకరించబడతాయి. స్వంతబ్లాగులు, స్వంత వెబ్ సైట్స్, స్వంత పత్రికలు మొదలైన వాటిల్లో ప్రచురించుకున్న లేదా ప్రచురించబడిన రచనలు పరిగణింపబడవు. ఈ మేరకు హామీ పత్రం రచనతో బాటు విధిగా జత పరచాలి.
- “ప్రధాన విభాగం” పోటీలొ పాల్గొనే రచయితలకు 18 ఏండ్లు నిండి ఉండాలి.ప్రధాన విభాగంలో స్వీయ రచనలు పంపాలి. ప్రధాన విభాగంలో అనువాద కధలు, అనువాద కవితలు అనుమతింపబడవు.
- “అనువాద కధ, కవితల రచనా విభాగం (18 ఏండ్ల లోపు రచయితలకు)” పోటీలో పాల్గొనే వారు డిసెంబర్ 1, 2019 నాటికి తమ వయస్సు 18 ఏండ్ల లోపు అని తమ హామీ పత్రంలో పేర్కొనాలి. మూల కధ ఏ భాషలో నైనా ఉండవచ్చు. కానీ అనువదింపబడిన కధ మాత్రం పోటీదారు స్వంతంగా తెలుగులోకి అనువదించిన రచన అయి ఉండాలి. 18 ఏండ్ల లోపు ఉన్న యువ రచయితల తల్లిదండ్రులు వారి తరపున హామీపత్రం పూరించవచ్చును.
- హామీపత్రం/ధ్రువీకరణ పత్రం ఇక్కడ నుండి డౌన్ లోడు చేసుకొనగలరు: https://tinyurl.com/tagsform:: డౌన్ లోడు చేసుకున్న పిదప సదరు పత్రం పూరించి, మీ రచన(ల)తో పాటుగా మాకు ఈమెయిలు చెయ్యగలరు.
- రచనల్లో ఎక్కడా మీ పేరు కానీ, మీ కలం పేరు కాని వ్రాయకూడదు. మీ రచనలు మాకు పంపినప్పుడు, మీ హామీపత్రం లో ఆవివరాలు రాస్తే సరిపోతుంది.
- మీ రచనలను తెలుగులో టైపు చేసి పంపితే బాగుంటుంది. యూనికోడ్ (Unicode) లో ఉన్న మీ రచనలు పంపితే మాకు శ్రమ తగ్గించిన వారు అవుతారు అని గమనించగలరు. చేతిరాత ప్రతులను పంపేవారు సదరు రచయిత చేతిరాత స్పష్టంగా, చదువ శక్యంగా ఉండాలని మనవి. అస్పష్ట, సందిగ్ధమైన లేదా చదవడానికి వీలుకాని రచనలు పోటీకి పరిశీలింపబడవు.
- బహుమతి పొందిన రచనలూ, ప్రచురణార్హమైన ఇతర రచనలు కౌముది (http://www.koumudi.net) , సుజన రంజని (https://sujanaranjani.siliconandhra.org), శాక్రమెంటో స్థానిక పత్రిక “సిరిమల్లె” http://sirimalle.com , మరియూ ఇతర పత్రికలలోనూ ఆయా సంపాదకుల వీలుని బట్టి, కేవలం వారి నిర్ణయానుగుణంగా మాత్రమే ప్రచురించబడతాయి.
- బహుమతి పొందిన రచనలూ, ప్రచురణార్హమైన ఇతర రచనలు TAGS వారిశాక్రమెంటో తెలుగు వెలుగు పత్రికలో ప్రచురించబడతాయి.
- విజేతల వివరాలురాబోయే సంక్రాంతి 2020 పండుగ కు ముందు ప్రకటించబడతాయి. కాపీ రైట్స్ తమవే అయినా, ఆ లోపుగా తమ ఎంట్రీలను రచయితలు ఇతర పోటీలకు, ఇంకెక్కడా ప్రచురించ కూడదు.
- కాలిఫొర్నియా రాష్త్రంలో నెలకొనిఉన్న శాక్రమెంటో నగరం లో, జనవరి 11, 2020 నజరగబోయే TAGS 16వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి సంబరాల సందర్భంగా సభా ముఖంగా వేదికపై విజేతలకు బహుమతులు అందజేయబడతాయి, రాలేనివారికి పోస్టులో బహుమతులు పంపడం జరుగుతుంది. విదేశాలలో ఉంటున్న తెలుగు రచయితలకి ఇది ప్రత్యేక అవకాశం.
- విజేతల ఎంపికలో న్యాయ నిర్ణేతలదీ, ఇతర విషయాలలో నిర్వాహకులదే తుది నిర్ణయం.
మీ రచనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ: డిసెంబర్ 1, 2019
మీ రచనలు మా ఈ-మెయిలు telugusac@yahoo.com కు PDF, JPEG లేదా Unicode లో పంపండి. Unicode లో పంపితే మరీ మంచిది.
శాక్రమెంటో తెలుగు సంఘం రచనల పోటీ కార్యవర్గం
|
నాగ్ దొండపాటి (అధ్యక్షులు) |
అనిల్ మండవ (చైర్మన్) |













