శాక్రమెంటో తెలుగు సంఘం 14 వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి సంబరాలు
కాలిఫోర్నియా రాష్ట్రం లో ఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం (టాగ్స్) 14 వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి సంబరాల సందర్భం గా పూర్తి నిడివి జానపద నృత్య రూపకం “తెలుగు విజయం” ఆహుతులను విశేషం గా ఆకట్టుకొన్నది. రంగవల్లులు, సంక్రాంతి పాలవెల్లి సెట్టింగ్, మరియు 300 కు పైగా ఉన్న కళాకారులు చేసిన సందడితో సంక్రాంతి వేడుకల ప్రాంగణం లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. స్థానిక ఫోల్సోం నగరం లో ఉన్న ఫాల్సం హైస్కూల్ ధియేటర్ లో శనివారం జనవరి 20 వ తేది 2018 మధ్యాన్నం 12 గం కు మొదలైన సంక్రాంతి సంబరాలు రాత్రి 11 గంవరకు కొనసాగాయి.
శాక్రమెంటో తెలుగు సంఘం సంక్రాంతి సంబరాల లో ప్రదర్శించిన ముఖ్యాంశాలు:
1.జానపద కళా ప్రపూర్ణ “డా. లింగా శ్రీనివాస్“ రూపొందించిన పూర్తి నిడివి జానపద నృత్య రూపకం “తెలుగు విజయం”
2. బుర్రకథ, కోలాటంతదితర సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించిన శ్రీమతి శ్రీదేవి మాగంటి బృందం
3. వేదిక పై వివిధ ఇతర సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్న300 మందికి పైగా స్థానిక కళాకారులు
4. డప్పుతో ప్రియమైన అతిధులకు వేదికపై స్వాగతం పలికి ఆకట్టుకున్న స్థానిక చిన్నారి
సంక్రాంతి వేడుకల సందర్భం గా టాగ్స్ అధర్వంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు, పూర్తి నిడివి జానపద నృత్య రూపకం “తెలుగు విజయం”, వేదిక పై ఉన్న 300 మందికి పైగా స్థానికకళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఫాల్సం నగరం లో ఉన్న స్థానిక రుచి ఇండియన్ రెస్టారెంట్ వారు వండిన నొరూరుంచే పసందైన తెలుగు వంటకాలు, మరి ఇంకెన్నో విశేషాలతోఆహుతులను అలరించాయి. కదలి రండి, కలసి రండి, సంక్రాంతి సంబరాన్ని ఉమ్మడిగా జరుపుకొందాము అని టాగ్స్ ఇచ్చిన పిలుపుకు స్పందించిన స్థానిక తెలుగు కుటుంబాలు 1000 మందికిపైగావేదిక కు తరలి వచ్చారు.
ఈ సందర్భం గా కాలిఫోర్నియా శాక్రమెంటో జిల్లా అధికారి శ్రీమతి సూ ఫ్రాస్ట్, ఫాల్సం నగర మేయర్ శ్రీ స్టీవ్ మిక్లోస్, కాలిఫోర్నియా నివాసి వితరణశీలి డా హనిమి రెడ్డిలక్కిరెడ్డి, “ఆపాప ఫౌండేషన్” సంస్థాపక అధ్యక్షుడు శ్రీ సి సి యిన్, సిలికానాంధ్ర చైర్మన్ శ్రీ ఆనంద్ కూచిభొట్ల ప్రియమైన అతిధులు గా విచ్చేసి ఆహుతులకు సంక్రాంతి శుభాకాంక్షలు అందజేశారు. వారందరూ స్థానిక తెలుగు కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలకు అచ్చెరువొందారు. టాగ్స్ కార్యవర్గ సభ్యులు వారందరినీ వేదిక పై ఆహ్వానించి ఘనం గా సన్మానం గావించి జ్ఞాపికలను అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీ ఆనంద్ కూచిభొట్ల మనదైన తెలుగుసంస్కృతి, కవిత్వం, సాహిత్యం, సంప్రదాయాలను తరువాతి తరం వారికి అందజేయాలని నొక్కి చెప్పారు. కూచిపూడి గ్రామం లో శరవేగంగా నిర్మాణమౌతున్న మల్టి స్పెషాలిటీ ఆసుపత్రి “సంజీవిని” నిర్మాణంలో పాలుపంచుకోవాలని ఆయన స్థానిక తెలుగు వారికి విజ్ఞప్తి చేశారు. కూచిపూడి గ్రామం చుట్టుపక్కల ఉన్న 150 గ్రామాలకు ఆరోగ్య సమస్యలు తీర్చే ఉద్దేశ్యంతో “సంజీవిని” ఆసుపత్రి బృహుత్ యజ్ఞానికి శ్రీకారం చుట్టామని ఆయన చెప్పారు. దాదాపు 500 కుటుంబాలకు పైగా ఉద్యోగ అవకాశాలను కల్పించడమే కాకుండా చిన్న పిల్లలకు, మహిళలకు ఉపయోగపడే రీతిలో “సంజీవిని” ఆసుపత్రి ని తీర్చి దిద్దుతామని, ఇందుకు సహాయం చేయదలచినవారు నేరుగా సిలికానాంధ్రను సంప్రదించాలని శ్రీ ఆనంద్ కూచిభొట్ల విజ్ఞప్తి చేశారు.
టాగ్స్ చైర్మన్ వెంకట్ నాగం, ప్రెసిడెంట్ మనోహర్ మందడి నేతృత్వంలో టాగ్స్ కార్యవర్గం ఈ సందర్భంగా 16 ఏండ్లుగా నిరంతరం తెలుగు భాష, సాంస్కృతిక ప్రచారానికి ప్రపంచ వ్యాప్తంగా కృషిచేస్తున్న శ్రీ ఆనంద్ కూచిభొట్ల కు జీవిత సాఫల్య పురస్కారం అందజేసి ఘనసన్మానం గావించింది. మరో ప్రియమైన అతిధి డా హనిమిరెడ్డి లక్కిరెడ్డి మాట్లాడుతూ, 1999 లో తాను భార్యబిడ్డలతో ఇప్పటివరకు నా సంపాదన మీకు, అయితే ఇప్పటినుండి నంపాదించించబోయేది అంతా సమాజ శ్రేయస్సుకు వెచ్చించుతానని చెప్పానని సభాముఖం గా చెప్పారు. దాతృత్రం తో అంతులేని ప్రశాంతత కలుగుతుందని ఆయన చెప్పారు.
కాలిఫోర్నియా మెర్సిడ్ నగరం లో ఉన్న యూనివర్సిటీ, సిలికానాంధ్ర యూనివర్సిటీ తో సహా అనేక భారతీయ, మరియు అమెరికావిద్యాసంస్థలకు తాను చేసిన భూరి విరాళాల గురించి చెప్పి ఆయన ఆహుతులను ఉత్తేజితులను చేశారు.
పిదప టాగ్స్ కార్యవర్గం డా హనిమిరెడ్డి లక్కిరెడ్డి కి ఘన సన్మానం గావించింది. శాక్రమెంటో కు తరలివచ్చిన యువ ప్రవాసాంధ్రులు పలువురు డా హనిమిరెడ్డి లక్కిరెడ్డి ప్రసంగం తమకు స్ఫూర్తిని రగిల్చింది చెప్పారు. అనంతరం స్థానిక, బుర్రకథలు, జానపద నృత్యాలు, పాటలతో తెలుగు రాజులు శాతవాహనులు, కాకతీయులు, మొదలుకొని ఇప్పుడు ఏర్పడ్డ రెండు తెలుగు రాష్ట్రాలను ప్రస్తుతిస్తూ వేదికపై శాతకర్ణి, ప్రతాపరుద్రుడు, రుద్రమ్మదేవి తదితర నేతలవేషధారణలతో 50 మందికి పైగా స్థానిక కళాకారులు చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకొంది. టాగ్స్ సౌజన్యం తో జరుగుతున్న శాక్రమెంటో శివారు నగరాలైన స్థానిక ఫాల్సం, రోసివిల్లి, నాటోమాస్ సెంటర్లలో చదువుతున్న సిలికానాంధ్ర మనబడి విద్యార్థులు చక్కని తెలుగు పద్యాలు, కధలు, పాటలు వేదికపై ప్రదర్శించారు.
ఈ సందర్భం గా ప్రతిభావంతులైన పిల్లలను పోత్సహించే గత సంప్రదాయాన్ని పాటిస్తూ, టాగ్స్ కార్యవర్గ సభ్యులు ఎంపిక చేసిన స్థానిక ప్రతిభావంతులైన పిల్లలకు జ్ఞాపికలు అందజేశారు. స్థానిక “వీ ఎంబ్రేస్” స్వచ్చంద సంస్థ వద్ద శిక్షణ పొందుతున్న దివ్యాంగుల చే ప్రదర్శించబడ్డ నృత్యప్రదర్శన ను ఆహుతులు అందరూ చప్పట్లతో ప్రోత్సహించారు. టాగ్స్సెక్రటరీ మోహన్ కాట్రగడ్డ వందన సమర్పణ గావించారు. అంతకు మునుపు శనివారం జనవరి 14న శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవాన్ని అదే వేదిక ప్రాంగణం లో ఉదయం 9 గం కు టాగ్స్ ఘనంగానిర్వహించింది. శ్రీ సిద్ది వినాయక మందిరం ఫ్రీమాంట్ నుండి ఫాల్సం కు విచ్చేసిన పూజారులు శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవం పూజ ను నిర్వహించారు. ఈ సందర్భం గా ప్రత్యేకంగా తయారుచేసినతీర్ధప్రసాదాలను భక్తులకు టాగ్స్ కార్యకర్తలు అందజేశారు.
కాలిఫోర్నియా శాక్రమెంటో లో సంక్రాంతి సంబరాలు విజయవంతం కావడానికి అహర్నిశలు కృషి చేసిన వారిలో టీఏజిఎస్ కార్యవర్గ సభ్యులు : మనోహర్ మందడి, మోహన్ కాట్రగడ్డ, సందీప్ గుడుపెల్లి, శ్రీదేవి మాగంటి, కీర్తి సురం, సురేంద్రనాథ్ కొప్పారపు, శ్రీరామ్ అకిన, మమతాదాసి, నాగేశ్వరరావు దొండపాటి, నాగేంద్రనాథ్పగడాల, శ్రీనివాస రావు యనపర్తి, ప్రసాద్ కేతిరెడ్డి, శ్రీధర్ రెడ్డి, అశ్విన్ తిరునాహరి, మల్లిక్ సజ్జనగాండ్ల, స్వర్ణ కంభంపాటి, వాసు కుడుపూడి, సుధాకర్ వట్టి, రాంబాబు బావిరిశెట్టి, అనిల్ మండవ, వెంకట్ నాగం, డా సంజయ్ యడ్లపల్లి మరియు టాగ్స్ కార్యకర్తలు పాల్గోన్నారు. ఫోటోగ్రఫీ సహకారం అందించిన దర్శన్ దేవచ, వీడియో సహకారం అందించిన రాకేష్ గుర్రాల “ఆర్ ఆర్ ఫోటోగ్రఫీ”కి టాగ్స్ కార్యవర్గం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది.
ఈ సందర్భం గా టాగ్స్ కార్యనిర్వాహక సభ్యులు అనాధ భారతీయ బాలబాలికలకు సహాయార్ధం హోప్ ఎబయ్డ్స్, రేణిగుంట లో ఉన్న అభయక్షేత్రం, హైదరాబాద్ లో ఉన్న విజిష్ణ వేగేశ్న ఫౌండేషన్, మరియు బ్యాక్ టూ ద రూట్స్ స్వచ్ఛంద సంస్థ కు టాగ్స్ ప్రత్యేకం గా విరాళాలుఅందజేస్తుంది అని, ఈ సంస్థలకు సహాయార్ధం విరాళం ఇవ్వదలచిన వారు మరింత సమాచారం కోసం sactags@gmail.com కు ఈమెయిలు లో సంప్రదించాలని టాగ్స్ కార్యనిర్వాహక సభ్యులు కోరారు. సంక్రాంతి సంబరాల ఫోటోలను ఫేస్ బుక్ https://www.facebook.com/SacTelugu/photos_stream లో చూడవచ్చు నని వారు తెలిపారు. టాగ్స్ చేపట్టబోయే కార్యక్రమాలకు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకోవాలనుకునేవారు http://www.sactelugu.org, https://www.facebook.com/SacTelugu ను సందర్శించాలని లేదా sactags@gmail.com కు ఈమెయిలు లో సంప్రదించాలని టాగ్స్ కార్యనిర్వాహక సభ్యులు కోరారు.













