TAGDV: అంగరంగ వైభవంగా టిఎజిడివి ఉగాది సంబరాలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ డెలావేర్ వ్యాలీ (TAGDV) ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది వేడుకలను ఏప్రిల్ 26, 2025న వెస్ట్ చెస్టర్ ఈస్ట్ హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో 600 మందికి పైగా పాల్గొని, నిర్వాహకులు ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి పరవశించిపోయారు. 150 మందికి పైగా చిన్నారులు, పెద్దలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని తమ కళా ప్రతిభను ప్రదర్శించారు. ఈ వేడుకలను పురస్కరించుకుని వివిధ పోటీలను కూడా ఏర్పాటు చేశారు. న్యాయంగా తీర్పు చెప్పిన న్యాయనిర్ణేతలకు ప్రత్యేక ధన్యవాదాలు. పోటీల్లో విజేతలు, ఫస్ట్ రన్నరప్‌లు, సెకండ్ రన్నరప్‌లను నిర్వాహకులు అభినందించారు. సాయంత్రం సంగీత విభావరి ప్రారంభమైంది. ఆదిత్య అయ్యంగార్, శ్రీష్టి చిల్లా, మాలవిక ఆనంద్, సింధు బుద్ధవరపు, అద్వైత్ బొందుగుల లాంటి గాయకులు తమ హృదయాన్ని హత్తుకునే పాటలు, ఉత్సాహభరితమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. డాన్స్ ఫ్లోర్‌పై చిన్నా పెద్దా అందరూ ఉత్సాహంగా నాట్యమాడారు.
ఈ వేడుకకు ఎల్ ఎస్ ప్రాపర్టీస్ సంస్థ అధినేత సురేష్ కాగితపు విరాళాలు ఇచ్చి ఎంతో సహకరించారు. నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) కూడా ఈ వేడుకలో కీలక భాగస్వామిగా వ్యవహరించి వేడుకల విజయవంతానికి కృషి చేసింది. వారి సహకారం, భాగస్వామ్యానికి టిఎజిడివి కృతజ్ఞతలు తెలియజేస్తోంది. మహాక్షా రెస్టారెంట్ ద్వారా శ్రీధర్ అప్పసాని అందించిన స్వాదిష్టమైన వంటకాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వేడుకలకు గౌరవ అతిథులుగా హరీనాథ్ బుంగటవుల (నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, టిఎజిడివి పాస్ట్ ప్రెసిడెంట్), శ్రీధర్ అప్పాసాని (నాట్స్ మాజీ చైర్మన్), రామ్ కొమ్మనబోయిన (నాట్స్ జాయింట్ సెక్రటరీ), వెంకట సాకమూరి (నాట్స్ బోర్డ్ డైరెక్టర్), మాజీ ప్రెసిడెంట్లు హరినాథ్ దొడపనేని, ముజీబుర్ రెహ్మాన్, శ్రీధర్ గుడాల (మాటా ట్రజరర్), రాజు కక్కెర్ల (ఆటా ట్రస్టీ), కమల్ నెల్లుట్ల (ఫిలడెల్ఫియా తెలంగాణ అసోసియేషన్), సునీల్ కొగంటి (తానా) పాల్గొన్నారు.
టిఎజిడివి ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షుడు తులసి రామ్మోహన్ రావు తల్లూరి, వైస్ ప్రెసిడెంట్ హరీష్ అన్నబత్తిన, సెక్రటరీ సురేష్ బొందుగుల, ట్రెజరర్ మధు బుదాటి, జాయింట్ సెక్రటరీ శ్రీకాంత్ చుండూరి, జాయింట్ ట్రెజరర్ శివ అనంతుని, కార్యవర్గ సభ్యులు నీలవేణి కందుకూరి, కవిత కురుకొండ, సునీత సిద్ధపురెడ్డి, భాస్కర్ మక్కెన, గౌరి కర్రోతు, కృష్ణ నందమూరి, విక్రమ్ అర్జుల, లవ ఐనంపూడి, సురేష్ యెల్మర్తి ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేశారు. శ్వేతా కొమ్మోజి, కృషిత నందమూరి యాంకర్లుగా కార్యక్రమాలను చక్కగా నడిపారు. ఆడియో, వీడియో సేవలను ఆదినారాయణ మూర్తి నూతనపాటి, రమణ రాకోతు అందించారు. గురు శ్రీమతి స్వాతి అట్లూరి (సిద్ధేంద్ర కూచిపూడి ఆర్ట్ అకాడమీ) శిష్యుల కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
యూత్ చైర్ యుక్త బుంగటవుల, కో-చైర్స్ అమృత సాకమూరి, నిహారిక ఐనంపూడి, ఆదిత్య అనంతుని సందర్శకులను చూసుకోవడం, రోజంతా స్నాక్స్ అందించడం వంటి సేవలను అద్భుతంగా నిర్వహించారు. ప్రశాంత్ పసుపుల, రాజా గంధే, మురళీధర్ కామిశెట్టి లు కూడా తమ సహాయాన్ని అందించారు.
విశ్వనాథ్ కొగంటి రోజంతా ఫోటోలు తీసి ఈ వేడుకను చిరస్మరణీయంగా మార్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే, సాయి టెంపుల్ మాల్వెర్న్ నుండి రత్నాకర్ శర్మ గారు ఉగాది పంచాంగ శ్రవణం అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు.
టిఎజిడివి 2025 ఉగాది ఉత్సవాలు గ్రేటర్ డెలావేర్ వ్యాలీలోని తెలుగు సమాజానికి సంస్కృతి, సంప్రదాయాన్ని ఆధునికతతో మేళవిస్తూ, అందరికీ చిరస్మరణీయమైన అనుభూతులను అందించాయి.








