ఘనంగా ముగిసిన టీఏజీడీవీ సంక్రాంతి సంబరాలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ డెలవార్ వ్యాలీ (టీఏజీడీవీ) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. పెన్సిల్వేనియాలోని భారతీయ టెంపుల్లో ఈ వేడుకలు విజయవంతంగా ముగిశాయి. 400 మందికిపైగా కమ్యూనిటీ సభ్యులు ఈ సంబరాల్లో పాల్గొన్నారు. వివిధ సాంస్కృతిక కార్య్రమాల్లో చిన్నా, పెద్దా అని లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. అనంతరం ప్రముఖ సింగర్ ప్రసాద్ సింహాద్రి, హర్షిత, శ్రీజ బోడ్డు, అదవిత్ బొండుగుల తమ పాటలతో అందర్నీ అలరించాడు. టీఏజీడీవీ ప్రెసిడెంట్ ముజీబుర్ రెహ్మాన్, వైస్ ప్రెసిడెంట్ రామ్మోహన్ తల్లూరి, సెక్రటరీ హరీష్ అన్నాబతిన, ట్రెజరర్ అరవింద్ పరుచూరి, జాయింట్ సెక్రటరీ మధు బూదటి, జాయింట్ ట్రెజరర్ సురేష్ బొండుగుల, సభ్యులు శివ అనంతుని, రాజ్ కక్కెర్ల, రమణ రాకోతు, శ్రీకాంత్ చుండూరి, నీలవేణి కందుకూరి, సుదర్శన్ లింగుట్ల, భాస్కర్ మాకెన్, గౌరి కుర్రోతు, దీపిక కొప్పుల, టీఏజీడీవీ వాలంటీర్లు రవి ఇంద్రకంటి, అపపారావు మల్లిపూడి, లవ కుమార్, సురేష్ యలమర్తి తదితరులంతా కలిసి ఈ కార్యక్రమం ఆసాంతం సందడిగా జరిగేలా ప్రణాళికలు వేశారు. నాట్స్ వైస్ ప్రెసిడెంట్ ప్రోగ్రామ్స్ హరి బుంగతువ్వల, పీటీఏ ప్రతినిధులు మాధవ రెడ్డి మోసర్ల, కమల్ నెల్లుట్ల, రాజ్ మామిడి, బక్స్మాంట్ బతుకమ్మ ప్రతినిధులు శ్రీని శ్రీకోటి, రాజ్ తోట తదితరులు ఈ వేడుకలకు హాజరై టీఏజీడీవీకి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ టీఏజీడీవీ ప్రెసిడెంట్ ముజీబుర్ రెహ్మాన్ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.







