టిఎజిసి మహిళా దినోత్సవ వేడుకలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో (టిఎజిసి), అమెరికన్ తెలంగాణ సంఘం (ఎటిఎస్) సహకారంతో 2023 మార్చి 5న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని విజయవంతముగా నిర్వహించారు. ఈ కార్యక్రమం చికాగోలోని ఓలివ్ ప్యాలేస్ బంక్వేట్స్లో జరిగింది. ఈ కార్యక్రమానికి చికాగో మహానగరం నలుమూలల నుండి 500 మందిపైగా మహిళలు హాజరయ్యారు. శ్రుతి ఠాకూర్ ప్రార్ధన గీతములతో కార్యక్రమము ప్రారంభమైంది. అధ్యక్షుడు పరమేశ్వర రెడ్డి యరసాని, అరుణశ్రీ యరసాని, సహా హోస్ట్ ఎటిఎస్ ప్రెసిడెంట్ నరేంద్ర చేమర్ల, రాజలక్ష్మి చేమర్ల, జ్యోతి మాధవరం, ఉమెన్స్ డే చైర్ మాధవి రాణి కొనకళ్ళ, కో-చైర్ నీలిమ బొడ్డు, రచన కొలుగూరి, వాణి రాచకొండ, టీఏజీసీ మహిళా బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఉమా అవధూత, వినీత పొద్దుటూరి, అర్చన పొద్దుటూరి, నీలిమ చైకిచెర్ల, శిరీష మద్దూరి, ప్రసన్న కందుకూరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అతిథిగా విద్య నహర్ మహిళల కోసం యోగా ప్రాముఖ్యతను వివరించారు.
ఈ కార్యక్రమంలో చికాగో ప్రాంతం నుంచి వచ్చిన పెద్దలను ఆదరించి సత్కరించారు. ఈవిధమైన సత్కారమునకు మిక్కిలి సంతోషించి అధ్యక్షుడు పరమేశ్వర రెడ్డియరసాని, ఉమెన్స్ డే చైర్ మాధవి రాణికొనకళ్ళకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమములో పాల్గొన్నవారికి ఫ్యాషన్ వాక్, రీల్స్, షార్ట్స్ పోటీలు, కాహూట్ గేమ్స్, ఇతర ఆహ్లాదకరమైన పోటీలను నిర్వహించి ఉత్తేజపరిచారు. యాంకర్ సమీర ఇల్లెందుల అందరికీ చమత్కార పశ్న్రలతో జోష్‌ను అందించారు. ఈ కార్యక్రమములో స్వదేశంలో సేవా కార్యక్రమాలు అందిస్తున్న నాన్-ప్రాఫిట్ సంస్థలు విరాళాలు సేకరించి అందించడం జరిగింది. దీనిలో భాగంగా ఆంధప్రద్రేశ్లోని సుగుణ ఫౌండేషన్, హైదరాబాద్ లోని అక్షయ ఫౌండేషన్‌కు చందాలను వసూలు చేసి సమర్పించడం జరిగింది. చికాగోలో దివాన్ స్ట్రీట్‌లోని రీగల్ జ్యువెలర్స్ వారు రాఫెల్ టికెట్లకోసం స్వర్ణం, వెండి నాణాలను స్పాన్సర్ చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి మహిళకు పీఎం కంసల్టింగ్ అధినేత కల్యాణి జొన్నవిత్తుల రిటర్న్ గిఫ్ట్స్ స్పాన్సర్ చేశారు. టీఏజీసీటీమ్ వారు యూత్ వాలంటీర్ల సహకారాలను అభినందించి సత్కరించడం జరిగింది.













