TAGB: సంక్రాంతి సందర్భంగా టీఏజీబీ సంగీత విభావరి.. షణ్ముఖ ప్రియ లైవ్ బ్యాండ్ పర్ఫార్మెన్స్
న్యూయార్క్: తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ బోస్టన్ (TAGB) ఆధ్వర్యంలో 2026 సంక్రాంతి పండుగ వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా సంగీత విభావరి, సంప్రదాయ ముగ్గుల పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ ఏడాది సంక్రాంతి సంబరాల్లో ఇండియన్ ఐడల్ 12 ఫైనలిస్ట్, ఏ.ఆర్. రెహమాన్ జాజ్ స్టార్ షణ్ముఖ ప్రియ తన అద్భుతమైన గాత్రంతో అలరించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రవేశం ఉచితం. కేవలం $10 చెల్లించి RSVP చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని ఆహార కూపన్ రూపంలో తిరిగి ఇస్తారు.






