TAGB: టీఏజీబీ సంక్రాంతి ముగ్గుల పోటీ 2026.. విజేతలకు ఆసక్తికర బహుమతులు
న్యూయార్క్: మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా పోటీలు నిర్వహించడానికి టీఏజీబీ సిద్ధమవుతోంది. సంక్రాంతి ముగ్గుల పేరుతో నిర్వహించనున్న ఈ పోటీలో విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు అందజేస్తారు.
పోటీ వివరాలు:
తేదీ: జనవరి 10, 2026
సమయం: మధ్యాహ్నం 12:00 గంటల నుండి 3:00 గంటల వరకు
వేదిక: బెల్లింగ్హామ్ హై స్కూల్, 60 Blackstone St, Bellingham, MA 02019
నిబంధనలు, బహుమతులు:
మొదటి ముగ్గురు విజేతలకు మంచి బహుమతులు ఉంటాయి. విజేతల వివరాలను అదే రోజు సాయంత్రం 6:30 నుండి రాత్రి 10:00 గంటల మధ్య ప్రకటిస్తారు. మీరు వేసే ముగ్గులో ఏదో ఒక చోట తప్పనిసరిగా TAGB అని రాసి ఉండాలి. పోటీదారులు తమ ముగ్గు ఫొటోను, ముగ్గుతో కలిసి ఉన్న తమ ఫొటోను పంపవలసి ఉంటుంది. ఈ పోటీలో పాల్గొని మీ ప్రతిభను చాటుకోవాలని టీఏజీబీ ఆహ్వానిస్తోంది.






