TAGB Dasara-Deepavali Celebrations – Registration Open
బోస్టన్ పరిసర ప్రాంతాల తెలుగు సంఘం నిర్వహించే దసరా – దీపావళి వేడుకల కార్యక్రమంలో పాల్గొనటానికి ఇదే మా ఆహ్వానం! దీపావళి అనగానే మనకు గుర్తుకు వచ్చేవి టపాకాయాలు, వాటికి సంబంధించిన జ్ఞాపకాలు. టపాకాయలు ఇంటికి తీసుకురాగానే, వాటిని జాగ్రత్తగా సంచిలో నుండి బయటకు తీసి, విడిగా పరిచి ఎండలో పెట్టి, రోజు వాటిని చూసుకుంటూ పండగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే పిల్లలు! కాకర పువ్వొత్తులు! చిచ్చు బుడ్లు! మతాబులు! సీమ టపాకాయలు, తారాజువ్వలు! విష్ణు చక్రాలు! భూచక్రాలు!
దీపావళి పండుగకి ముందుగానే, దసరా సరదాలు మొదలవుతాయి. నవరాత్రులు, అమ్మవారి వివిధ రూపాల పూజలు, కొత్త బట్టలు, పిండివంటలు, బంధుమిత్రుల కబుర్లు గుర్తు కొస్తాయి.
మన దసరా-దీపావళి వేడుకలు అందరినీ ఆకట్టుకునేలా విన్నూత్న కార్క్యక్రమాలతో రూపొందిస్తున్నాం. ఈ అక్టోబర్ 28 న దసరా-దీపావళి వేడుకలలో మీరంతా ద్విగుణీకృతమైన ఉత్సాహంతో పాల్గొంటారని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమ నిర్వహణలో మీ అందరి సహాయ సహకారాలు మాకు ఎంతో అవసరం! మన TAGB దసరా-దీపావళి వేడుకల సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనటానికి రిజిస్టర్ చేసుకొనండి.
ఈపత్రిక రచనలకు ఆహ్వానం!
ఔత్సాహిక TAGB రచయిత/రచయిత్రులకి ఇదే మా ఆహ్వానం! దయచేసి మీ..
•కథలు / కధానికలు
•కవితలు / పద్యాలు
•ఛలోక్తులు / కార్టూన్స్
•వ్యాసాలు / ఇతరత్ర రచనలు
తెలుగు లిపిలో, మీ స్వీయ రచన అని ఫోటో జతపరచి పంపండి.
దసరా – దీపావళి ‘ఈపత్రిక’సంచిక కోసం మీ రచనలు పంపండి. రచనలు పంపవలసిన చిరునామా: epatrika@tagb.org













