టాకో ఆధ్వర్యంలో అవార్డుల ప్రదానం
కొలంబస్‌లోని ఒహైయోలోగల పికెరింగ్టన్ హైస్కూల్లో సెంట్రల్ ఒహాయో తెలుగు సంఘం (టాకో) ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పలువురికి పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ రచయిత యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ను సంఘం అధ్యక్షుడు నాగేశ్వరరావు సత్కరించారు. అక్షరమాల కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు సంఘం కార్వనిర్వాహక కమిటీని ఆయన అభినందించారు.
తెలుగు రాష్ట్రాల్లో 32 గ్రామాలకు తాగునీటిని అందించిన పేర్ని వీరయ్య చౌదరిని టాకో అభినందిస్తూ సేవా రత్న అవార్డు అందజేసింది. గడ్డం శ్రీకాంత్‌కు సేవారత్న పురస్కారాన్ని, విశేష ప్రతిభ కనబర్చిన ముగ్గురు విద్యార్థులకు విద్యాది రత్న అవార్డులను ప్రదానం చేశారు. తెలుగు రచన, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ చూపిన 40 విద్యార్థులకు అక్షరమాల అవార్డులు అందించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 400 మంది పిల్లలు, పెద్దలు పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలుగు సినీ తారలు నిఖిల్, స్వాతి ప్రత్యేక అకర్షణగా నిలిచారు. కార్యక్రమ విజయవంతానికి కృషి చేసిన అధ్యక్షుడు నాగేశ్వరరావు మన్నె, ఉపాధ్యక్షుడు రవి వంగూరి, జ్యోతి పూదోట, జగన్నాథ్ చలసాని, ప్రసాద్ కండ్రు, శ్రీకాంత్ మునగాల, వేణు బుట్టల, నరేశ్‌కుమార్ గంధం, ప్రతిమ సూరవరపు, షిర్డీ గోమతి, విజయ్ కాకర్ల, వెంకట్ కనక, సుబ్రహ్మణ్యం కాశిచైనుల, వినోద్ కోసికే, హనుమాన్ కనపర్తి, శ్రీనివాస్ పోలిన, మహేంద్రనాథ్ వన్నె, లతా సాదినేని, హారిక కొమ్మూరి తదితరులకు టాకో కార్యనిర్వాహక కమిటీ ధన్యవాదాలు తెలియజేసింది.













