టాకో దీపావళి సంబరాలు
ప్రస్తుత “కరోనా” పరిస్థితుల ప్రభావం కారణంగా తెలుగు అసోసియేషన్ అఫ్ సెంట్రల్ ఒహయో, కొలంబస్ వారు దీపావళి వేడుకలు డిసెంబర్ 13న ఉదయం 11గంటలకి అంతర్జాలంలో జరుపుకున్నారు. టాకో అధ్యక్షులు జగన్ చలసాని గారి అధ్యక్షతన , కల్చరల్ వైస్ ప్రెసిడెంట్ నీలిమ ఎలమంచిలి గారి కార్యపర్యవేక్షణలో ప్రముఖ వ్యాఖ్యాత శ్రీమతి సాహిత్యగారి నేతృత్వంలో ఈ వేడుకలు సరదాగా ఆహ్లాదంగా జరిగింది .ఈ అంతర్జాల కార్యక్రమానికి “యాన్ ఆర్ ఐ స్ట్రీమ్స్” వారు సాంకేతిక సహకారం అందిచారు . కొలంబస్ చిన్నారి కళ్యాణ్ చెఱువు వినాయకుడు పాటతో ప్రారంభం కాగా , రజిత బోనగిరి గారి పాటలు శ్రోతలకు వీనుల విందు చేసాయి . “యువ కళా రత్న” ప్రముఖ బుల్లితెర నటులు “ఫోర్ లెగ్స్ కిరణ్” గారి బుడగ (బెలూన్), శిల (స్టాట్యూ) నటన , స్ప్రింగ్ మరియు నాలుగు కాళ్ళ నాట్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. ఇంకా కొలంబస్ లోని “సాయి ఆర్ట్ గ్రూప్ “పిల్లల నాట్య ప్రదర్శనలు ముచ్చటగా ఉన్నాయి.
కరోనా ప్రభావంతో ఈ సంవత్సరం పండగ సరదాలు, సంప్రదాయ సంభరాలు అన్ని వారి వారి ఇళ్ళకే ప్రమితమైయ్యాయి. అందుకు టాకో కమిటీ వారు కొలంబస్ తెలుగు ప్రజల దీపావళి పండగ విశేషాలును , వారి ఫోటోలను కార్యక్రమంలో ప్రదర్శించి లక్కీ డిప్ తీసి ముగ్గురి విజేతలకు బహుమతులు ఇచ్చారు. ఈ లక్కీ డిప్ విజేతలను కొలంబస్ నివాసి, “లొనికా జెవెల్లెర్స్” అధినేత వినీల కాట్రగడ్డ గారు ప్రకటించడమేకాకుండా వారికీ బహుమతులను కూడా స్పాన్సర్ చేసారు. టాకో వారు ఎల్లపుడూ కళలకు పెద్దపీట వేస్తారు. ఈ దీపావళి కి హైదరాబాద్ లోని కూచిపూడి సంస్థ “మువ్వ నృత్య రాగ నిగమ్ ” వారిచే “సామజ వర గమన”, “నామ రామాయణం” వంటి కూచిపూడి నృత్యాలు ప్రదర్శింపజేశారు . “మువ్వా” సంస్థ అధినేత శ్రీ Dr . హిమబిందు కానోజ్ గారు “శ్రీ రాముని జనం నుంచి వారి పట్టాభిషేకం వరకూ సన్నివేశాలు ఈ “నామ రామాయణం ” యొక్క ప్రాముఖ్యతలని వివరించారు . తదుపరి అధ్యక్షులు జగన్ చలసాని గారు టాకో ప్రారంభించి 36 సంవత్సరాలు సందర్భంగా భారత ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు శుభాకాంక్షలు అందిచారు అని చెప్పారు.
ఇంకా 2020లో టాకో చేసిన “ముగ్గుల పోటీలు, సంక్రాంతి సంభరాలు, తెలుగు అక్షరమాల పోటీలు , టాకో తో నటులు కార్తీక్ , జల (నాట్య , సంగీత కార్యక్రమం, 5K వాక్, యూత్-Backtoschool ప్రోగ్రాం తో $1000 హయట్స్ మిడిల్ స్కూల్ కి విరాళం ” కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు .2021 అధక్షులు శ్రీ శివ చావా గారిని సాదరంగా ఆహ్వానించారు . శివ చావా గారు తమ బృందంతో రానున్న సంవత్సర కార్యక్రమాలతో సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పారు . 2020 టాకో కమిటీ అయిన జగన్ చలసాని, కాళీ ప్రసాద్ మావులేటి, సుధీర్ కనగాల, ఉష శాఖమూరు, రాజ్ వంటిపల్లి, సంపత్ నాలం, విజయ్ కాకర్ల, శివ చావా, అనిల్ బ్యాడిగెర, వేణు అబ్బూరి, రామ్ సానేపల్లి , వినోద్ యడ్లపల్లి ,సత్య మర్రే , ప్రదీప్ గుంటక , శ్రీఆదిత్య అట్లూరి, ప్రవీణ్ కుమార్ అంకం , రాజేష్ చెరుకూరి , భాను పొట్లూరి , శ్రీవర్షిణి ముద్దులూరు , తేజశ్వని కంచరపల్లి , ప్రదీప్ చందనం , నీలిమ యలమంచలి, జయ మేడిడి , విక్రమ్ రాచర్ల , కీర్తి కౌశిక్ తరణి , అన్వేష్ పెండ్యాల ,ఊహ కాట్రగడ్డ , రమ ప్రత్తిపాటి , చిరంజీవి సమ్మెట, అపర్ణ దండమూడి లు “వీడుకోలే దేనికైనా ” అంటూ ఆనందంగా సెలవు తీసుకుంటూ 2021 కమిటని మనసారా ఆప్యాయంగా స్వాగతం పలికారు.













