ర్యాంప్ పైనే బిడ్డకు పాలిచ్చిన మోడల్
మారా మార్టిన్ ఆమె ఓ ప్రముఖ స్విమ్ సూట్ మోడల్. డిజైన్ చేసిన దుస్తులను ర్యాంప్ పై ప్రదర్శిస్తుంటుంది. అయితేనేమి ఆమెలోనూ ఓ తల్లి ఉంది. బిడ్డ ఏడుపును తట్టుకోలేని మనసు ఉంది. బిడ్డ ఆకలితో ఏడుస్తున్నాడని తెలిసి, ర్యాంప్పైనే బిడ్డను చేతుల్లోకి తీసుకొని పాలు ఇచ్చింది. ఆ దృశ్యాలు సమాజిక మాధ్యమాల ద్వారా వైరల్ కాగా, పలువురు ఆమె చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. మియామీ స్విమ్ వీక్లో భాగంగా మరి 16 మందితో కలిసి ఆమె ర్యాంప్ వాక్ చేసింది. ఆమెకు ఐదు నెలల చిన్నారి ఉండగా, ఆమె ప్రదర్శిస్తున్న సమయంలో బిడ్డకు పాలు ఇవ్వాల్సి వచ్చింది. తల్లిగా తన బాధ్యతను ప్రేక్షకుల ముందే నెరవేర్చడానికి ఆమె ఏ మాత్రం బిడియ పడకుండా పాలు ఇచ్చింది. మాతృత్వానికి ఆమె మారు పేరు అని, స్ట్రాంగ్ ఉమన్ అని నెటిజన్లు పొగుడుతుంటే, వారికి కృతజ్ఞతలు తెలుపుకుంది మారా.













