డాలస్ లో NRI YSRCP ఆధ్వర్యంలో వివేకానంద జయంతి వేడుకలు
డాలస్ మహా నగరంలో స్వామి వివేకానంద 155 వ జయంతి (జనవరి 12 వ తేది) ని వారాంతంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జాతీయ యువజన దినోత్సవంగా డాలస్ YSRCP ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున యువత హాజరై స్వామి వివేకానంద స్వాముల వారు యువతకి ఎలా ఆదర్సప్రాయులు అయ్యారో, ఎలా దిశా నిర్దేశం చేసారో గుర్తు చేసుకోవడం జరిగింది.
డాక్టర్ శ్రీధర్ రెడ్డి కొర్సపాటి మాట్లాడుతూ స్వామి వివేకానందుల వారు భారత దేశం ఒక మెల్టింగ్ పాట్ లాగా అన్ని మతాలను తనలో ఇముడ్చుకోగలిగింది అని 1893 లో చికాగో లో జరిగిన ప్రపంచ మతాల పార్లమెంట్ సదస్సు లో చెప్పడం జరిగిందని గుర్తు చేసుకున్నారు. అలాగే స్వార్థం కోసం కాకుండా ప్రజల కోసం కష్టపడితేనే అది జీవితమన్న స్వామి వివేకానందుల వారి సూక్తి ని ఆదర్సవంతంగా తీసుకొని ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి గారు నిస్వార్థంగా ప్రజల కోసం పాదయాత్రలో కష్ట పడుతున్నారని చెప్పారు.
గరికపాటి రాము మాట్లాడుతూ యూని వెర్సల్ ఆక్సెప్టేన్సీ, టాలరెన్స్ గురించి స్వామి వివేకానందుల వారు ఆనాడే చెప్పడం జరిగింది అన్నారు.
కృష్ణారెడ్డి కోడూరు మాట్లాడుతూ స్వామి వివేకానంద నేటి యువతకి ఆదర్శ ప్రాయులని, బలమే జీవితం, బలహీనతే మరణం అన్న స్వామి వివేకానందుల వారి సూక్తిని యువత ఆదర్సవంతంగా తీసుకోవాలని దేహం బలంగా వుంటే అలోచించే మెదడు కూడా బలంగా ఉంటుందని చెప్పారు. ప్రపంచంలో ఏదేశంలో కూడా భారత దేశంలో ఉన్నంత యువశక్తి లేదని యువతకి దేశ భవిష్యత్తు ని మార్చే శక్తీ ఉందని, యువత రాజకీయ రంగంలో కూడా దృష్టి పెట్టాలని కోరడమే కాకుండా జగన్ మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుని రాష్ట్రానికి నాయకునిగా ఎన్నుకోవాలని కోరారు.
కృష్ణ మోహన్ రెడ్డి కుందూరు మాట్లాడుతూ భారత దేశం అన్ని మతాల ఆచార వ్యవహారాలను గౌరవిస్తుందని దానికి స్వామి వివేకానందుల వారు ఏనాడో మనకి చెప్పారని గుర్తు చేసారు.
రమణ పుట్లూరు మాట్లాడుతూ స్వామి వివేకానంద చేపినట్లుగా ఏ పని చేసినా ధ్యాస తో చేయాలని యువతని కోరారు.
సుబ్బారెడ్డి కొండూరు వచ్చిన యువతకి ధన్యవాదాలు తెల్పి కార్యక్రమాన్ని ముగించారు.ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్యుల్లో డాక్టర్ శ్రీధర్ రెడ్డి, కృష్ణారెడ్డి కోడూరు, కృష్ణ మోహన్ కుందూరు, రాం గరికపాటి సుబ్బారెడ్డి కొండూరు, ఉమా కుర్రి, శరత్ యర్రం, ఉదయ్, భాస్కర్, కులశేఖర్, ఉమా మహేష్, కిషోర్, జయచంద్ర, జయంత్, వెంకట్, వివేక్, మొదలగు వారు.













