ఆమె ఓ ఛాంపియన్ : ఇవాంక
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మాస్వరాజ్ హఠాన్మరణం పట్ల అమెరికా అధ్యక్షుడి సీనియర్ సలహాదారు, ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుష్మాజీ ఓ ఛాంపియన్ అని కొనియాడారు. భారత్ ఓ గొప్ప నాయకురాలిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. విదేశీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ అకాల మరణంతో అంకితభావం గల నాయకురాలిని, ప్రజాసేవకురాలిని భారత్ కోల్పోయింది. భారత్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలకు ఆమె ఓ ఛాంపియన్. ఆమెతో పరిచయం ఉండటం గౌరవంగా భావిస్తున్నా అని ఇవాంక ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా భారత పర్యటనలో సమయంలో సుష్మాస్వరాజ్తో కలిసి దిగిన ఫొటోలను పంచుకున్నారు.













