పాక్ పై ఖచ్చితంగా చర్యలు : సుష్మా
పాకిస్థాన్ బెదరింపులకు భయపడేది లేదని భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ సృష్టం చేశారు. ఇస్లామిక్ సహకార సంస్థ (ఓఐసీ) సమావేశానికి ముఖ్య అతిథిగా సుష్మాస్వరాజ్ హాజరయ్యారు. ఓఐసీ భాగస్వామ్య దేశాలతో భారత్ సంబంధాలపై సుష్మా ప్రసంగించారు. అరబ్దేశాలతో బలమైన సంబంధాలున్నాయన్నారు. తీవ్రవాదానికి ఎలాంటి మతం, కులం లేదన్నారు. ప్రపంచ దేశాల ముందు పాక్ దోషిగా తేలిందని, ఉగ్రవాదంపై పాకిస్థాన్ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పుల్వామాలో జరిగిన ఘటనను ఓవైసీలో ఆమె ప్రస్తావించారు. కాగా ఓఐసీకి భారత్‌ను ఆహ్వానించడంతో పాకిస్థాన్ ఈ సమావేశానికి గైర్జాజరయింది. రెండు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి.












