అమెరికా విదేశాంగమంత్రితో సుష్మ భేటీ
అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్తో భారత విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ భేటీ అయ్యారు. హెచ్-1బీ వీసాలు, ఉగ్రవాదం తదితర అంశాలపై చర్చలు జరిపారు. ఐరాస సర్వప్రతినిధి సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన సుష్మ, న్యూయార్క్లో టిల్లర్సన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అఫ్గానిస్థాన్లో, ప్రాంతీయంగా స్థిరత్వం, అభివృద్ధి కోసం భారత్ చేస్తున్న కృషిని టిల్లర్సన్ ప్రశంసించారు. భారత్ అమెరికా రాజకీయ, ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలపరుచుకోవడంపై ఇద్దరు నేతలు చర్చలు జరిపారు. ఇటు హెచ్1-బీ వీసాలపై అమెరికా విధించిన ఆంక్షల వల్ల భారత ఐటీ నిపుణులు ఎదుర్కుంటున్న సమస్యలను టిల్లర్సన్ దృష్టికి సుష్మ తీసుకువెళ్లారు.













