అమెరికా ప్రతినిధులతో సుష్మ భేటీ
హెచ్-1బీ వీసాల జారీలో నెలకొన్న అనిశ్చితి తీవ్ర ఆందోళనకర విషయమని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ అభిప్రాయపడ్డారు. హెచ్-1బీ విధానంపై అమెరికా కాంగ్రెస్లో రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఏకాభిప్రాయానికి రావాలని అభిలషించారు. శాస్త్ర సాంకేతికత, అంతరిక్ష అంశాలపై ఏర్పాటైన అమెరికా కాంగ్రెస్ కమిటీ ప్రతినిధి బృందంతో స్వరాజ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హెచ్-1బీ అంశాన్ని ఆమె లేవనెత్తారు. ఆర్థిక, శాస్త్రసాంకేతిక, అంతరిక్ష రంగాల్లో భారత్తో సంబంధాల బలోపేతానికి అమెరికా బృందం అధిక ప్రాధాన్యతనిస్తుండటాన్ని స్వరాజ్ స్వాగతించారు. భారత్-అమెరికా వ్యూహాత్మక సంబంధాల అభివృద్ధిలో అమెరికా కాంగ్రెస్ సానుకూల పాత్ర పోషిస్తోందంటూ శ్లాఘించారు.













