ట్రంప్ కంటే హిల్లరీ ప్రమాదకరం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ చాలా ప్రమాదకరమని హాలీవుడ్ ప్రముఖ నటి సుసాన్ సరాండన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ గెలిచి ఉంటే అమెరికా పరిస్థితి ఈ పాటికి ఎలా ఉండేదో ఊహించడమే కష్టమని, యుద్ధ వాతావరణంలో చిక్కుకుని ఉండేదని ఆందోళన వ్యక్తం చేశారు. హిల్లరీ చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని మండిపడ్డారు. అమెరికాలో నివసిస్తున్న వలసదారులను వెనక్కి పంపిస్తున్న డొనాల్డ్ ట్రంప్‌కు ఆమె మద్దతు పలికారు. గతంలో ఒబామా ఇదే పనిని మరో విధంగా చేశారని, ఇప్పటి కంటే ఎక్కువమందిని అప్పుడు పంపించారని ఆరోపించారు. హిల్లరీ అధ్యక్షురాలై ఉంటే ఒబామా బాటలోనే నడిచి ఉండేవారన్నారు. ఒబామాకు శాంతి బహమతి రావడం తనకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉందని అన్నారు. అయితే, ప్రజారోగ్యం పట్ల ఒబామా చాలా శ్రద్ధ కనబరిచారని, ఆయన ప్రవేశపెట్టిన ఒబామా కేర్ వంటి పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు.













