అమెరికన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తికి షాక్
ఫెడరల్ అప్పిలేట్ కోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన అమీ కోనీ బారెట్ను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల అమెరికన్ సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమించడంపై అక్కడి కార్మిక వర్గం భగ్గుమంది. ఆమె నియామకం కార్మిక హక్కుల కోసం పోరాడేవారికి ఒక దుర్వార్త అని న్యాయ విశ్లేషకులు పలువురు ఇప్పటికే వ్యాఖ్యానించారు. నార్టే డేమ్ యూనివర్సిటీ మాజీ లా ప్రొఫెసర్ అయిన బారెట్ ఫెడరల్ కోర్టు జడ్జిగా ఉన్న మూడేళ్లలో అంతకుముందు హైకోర్టు ఇచ్చిన తీర్పులను తోసిపుచ్చడం, రాజ్యాంగ నిబంధనలతో తాను ఏకీభవించనని చెప్పడం వంటివి చేశారు. మితవాద భావాలు కలిగిన అటువంటి వ్యక్తిని ట్రంప్ తీసుకొచ్చి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడంపై అమెరికన్ల నుంచి ముఖ్యంగా కార్మికవర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే పౌరుల హక్కులు, స్వేచ్ఛకు కట్టుబడిన జస్టిస్ గిన్స్బర్గ్ కు పూర్తి విరుద్దమైన వ్యక్తి ఈమె. గిన్స్బర్గ్ ఇటీవల కన్నుమూయడంతో ఏర్పడిన ఖాళీని భారెట్తో ట్రంప్ భర్తీ చేసిన సంగతి తెలిసిందే.













