డొనాల్డ్ ట్రంప్‌కు సుప్రీం గ్రీన్ సిగ్నల్
మెక్సికోతో సరిహద్దు గోడ నిర్మాణం కోసం డొనాల్డ్ ట్రంప్‌కు అమెరికా సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బోర్డర్ నిర్మాణం కోసం పెంటగాన్ నుంచి సుమారు 250 కోట్ల డాలర్లు ఖర్చు చేసేందుకు నిధులను ట్రంప్ కేటాయించారు. అయితే ఆ నిధులు ఖర్చు చేసేందుకు కోర్టు అనుకూల తీర్పునిచ్చింది. 2016 ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ఇచ్చిన నినాదంతో సరిహద్దు గోడ కీలకమైంది. డెమోక్రాట్లు మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గ్రీన్ సిగ్నల్‌తో పెంటగాన్ నిధులను కాలిఫోర్నియా, ఆరిజోనా, న్యూమెక్సికోల్లో సరిహద్దు గోడ నిర్మాణం కోసం వాడనున్నారు. కోర్టు తీర్పును ప్రస్తావిస్తూ ఇదో పెద్ద విక్టరీ అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. దిగువ కోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టిపారేసిందని ట్రంప్ తెలిపారు.













