ఎన్నారై ఓటుహక్కుపై సుప్రీంలో విచారణ
ప్రవాస భారతీయులకు దేశంలో జరిగే ఎన్నికల్లో ఓటువేసే హక్కు కల్పించేలా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రవాసీ భారత ఆర్గనైజేషన్ చైర్మన్, పిటిషనర్ చిందం నాగేందర్ తరపున హాజరైన న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఎన్నారైలకు ఓటుహక్కు కల్పించే బిల్లును ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. వాదనలను నమోదు చేసుకున్న ధర్మాసనం.. కేసు విచారణ మూడు నెలల పాటు వాయిదా వేస్తున్నట్టు పేర్కొన్నది.













